»   » 'గబ్బర్ సింగ్' తో పోలిక, అయినా 'బాహుబలి' రికార్డ్ బ్రద్దలు

'గబ్బర్ సింగ్' తో పోలిక, అయినా 'బాహుబలి' రికార్డ్ బ్రద్దలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రాజమౌళి వెండి తెర అద్బుతం 'బాహుబలి' . ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డ్ లు అన్నీఇన్నీ కావు. వాటిని బ్రద్దలు కొట్టడం సామాన్యమైన విషయమూ కాదు. అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ సింగిల్ హ్యాండ్ తో బాహుబలికి చెందిన ఓ రికార్డ్ ని బ్రద్దలు కొట్టాడు.

విజయ్ బ్రేక్ చేసిన ఆ రికార్డ్ ఏమిటీ అంటే...బాహుబలి ట్రైలర్ ...24 గంటల్లో 1.2 మిలయన్ల మంది చూస్తే, ఇప్పుడు ఆ రికార్డ్ ని విజయ్ తాజా చిత్రం తేరీ..22 గంటల్లో క్రాస్ చేసి అందిరకీ షాక్ ఇచ్చింది. ఈ వరస చూస్తూంటే సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజిలో ఎన్ని రికార్డ్ లు బ్రద్దలు అవుతాయో అంటున్నారు.

మరో ప్రక్క ఈ చిత్రం నిమిత్తం విడుదల చేసిన టీజర్, ట్రైలర్ రెండూ కూడా తెలుగులో ఘన విజయం సాధించిన గబ్బర్ సింగ్ చిత్రాన్ని గుర్తు చేయటం విశేషం. ముఖ్యంగా గబ్బర్ సింగ్ లో హైలెట్ గా నిలిచిన అంత్యాక్షరి సీన్ ఈ సినిమాలోనూ కనిపించేటట్లు ఉంది.

 Tamil Superstar Vijay breaks Baahubali Record

రాజా రాణి వంటి హిట్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కలైపులి ఎస్ తను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న పాటలు ఘనంగా విడుదలయ్యాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ విజయ్ తేరి తో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.

జోసెఫ్ మరియు విజయ్ కుమార్ అనే రెండు పాత్రలలో విజయ్ నటిస్తున్నాడు. మరి ఈ రెండు పాత్రలు ఒకరివేనా....లేక ఇద్దరు కూడా వేరువేరు క్యారక్టర్లా అనేది తెలియరావటం లేదు. విజయ్ సరసన అమీజాక్సన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

English summary
Ilayathalapathy Vijay chose to broke Baahubali records in his own style with his latest flick Theri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu