Don't Miss!
- News
అన్నెం సాయిపై మరో కేసు నమోదు..
- Sports
ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్.. సెంచరీతో రాజస్థాన్‌ను సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు
- Finance
వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
- Lifestyle
మీలో ఈ లక్షణాలు ఉంటే మద్యం సేవించడం వల్ల మీ కాలేయం ప్రమాదకర స్థితిలోకి వెళ్లిందని అర్థం...!
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Thalapathy 66 విజయ్‌తో ఢీ కొట్టేందుకు శ్రీకాంత్ రెడీ.. ఇంకా క్రేజీస్టార్లు రంగంలోకి..
తమిళ ఇళయ దళపతి విజయ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకొంటున్నది. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నది.
సూపర్ స్టార్ విజయ్ కెరీర్‌లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరోలు, నటీనటులు భాగస్వామ్యం కావడం దక్షిణాది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, శ్యామ్, సంగీత నటిస్తున్నారనే వార్తను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇంకా ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ, యోగిబాబు, సంయుక్త ఇతర కీలక పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

అఖండ చిత్రంతో మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిన సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్‌గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
నటీనటులు:
విజయ్,
రష్మిక
మందన్న,
శరత్
కుమార్,
ప్రభు,
ప్రకాష్
రాజ్,
శ్రీకాంత్,
జయసుధ,
శామ్,
యోగిబాబు,
సంగీత,
సంయుక్త
తదితరులు
దర్శకత్వం:
వంశీ
పైడిపల్లి
కథ,
స్క్రీన్
ప్లే:
వంశీ
పైడిపల్లి,
హరి,
అహిషోర్
సాల్మన్
నిర్మాతలు:
దిల్
రాజు,
శిరీష్,
పరమ్
వి
పొట్లూరి,
పెరల్
వి
పొట్లూరి
బ్యానర్:
శ్రీ
వెంకటేశ్వర
క్రియేషన్స్,
పీవీపీ
సినిమా
సహ
నిర్మాతలు:
శ్రీ
హర్షిత్
రెడ్డి,
శ్రీ
హన్షిత
సంగీతం:
ఎస్
థమన్
డీవోపీ:
కార్తీక్
పళని
ఎడిటింగ్:
కెఎల్
ప్రవీణ్
డైలాగ్స్,
అడిషనల్
స్క్రీన్
ప్లే:
వివేక్
ప్రొడక్షన్
డిజైనర్లు:
సునీల్
బాబు,
వైష్ణవి
రెడ్డి
ఎక్సిక్యూటివ్
ప్రొడ్యూసర్స్:
బి
శ్రీధర్
రావు,
ఆర్
ఉదయ్
కుమార్
మేకప్:
నాగరాజు
కాస్ట్యూమ్స్:
దీపాలి
నూర్
పబ్లిసిటీ
డిజైన్స్:
గోపి
ప్రసన్న
వీఎఫ్ఎక్స్:
యుగంధర్
పీఆర్వో:
వంశీ-శేఖర్.