For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకే ఫ్రేమ్ లో విజయ్, మహేంద్ర సింగ్ ధోని.. ఎందుకు కలిశారంటే?

  |

  ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ అంటే కేవలం అభిమానులకే కాదు అగ్ర హీరోలకు కూడా ఎంతో ఇష్టం. భాషతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో అభిమానులను సంపాదించుకున్న మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఎక్కువగా యాడ్స్ షూటింగ్ లతో బిజీగా మారాడు. ధోని సినిమా చేస్తే చూడాలని ఉందని అభిమానులు కూడా ఎంతో ఆశగా కోరుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో డిఫరెంట్ స్టైల్ ని ఫాలో అవుతున్న ధోని విభిన్నమైన హెయిర్ స్టైల్ ను కూడా సెట్ చేసుకుంటూ అభిమానులను సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు.

  రోజుకు ఒక స్టైల్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల హఠాత్తుగా ధోని కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారిందిమ్ అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు అనే విషయంలో అనేక రకాల అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మహేంద్రసింగ్ ధోని, విజయ్ ల మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహం అయితే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎస్ ధోని అప్పట్లో విజయ్ తో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. క్రికెట్ ఆటను కూడా అమితంగా ఇష్టపడే ఈ కోలీవుడ్ స్టార్ హీరో ఒకనొక సమయంలో చెన్నై టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగాడు.

  Thalapathy Vijay and Dhoni who happened to meet in a Chennai studio

  ఆ విధంగా విజయ్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పర్చుకున్న ధోని.. ఎప్పుడు చెన్నైకి వచ్చినా కూడా వీలైనంత వరకు అతన్ని కలిసే ప్రయత్నం చేస్తాడు. ఇక త్వరలో పున ప్రారంభం కాబోయే ఐపీఎల్ మ్యాచ్ ల కోసం సిద్ధమవుతున్న ధోని ఇటీవల చెన్నైకి వచ్చి మేనేజ్మెంట్ ను కలిసినట్లు సమాచారం. అలాగే స్టార్ హీరో విజయ్ ను కూడా చెన్నై లోని ఒక ఫిల్మ్ స్టూడియోలో ప్రత్యేకంగా కలుసుకున్నాడు. కొన్ని గంటల పాటు వారి మాటలు చాలా ఫ్రెండ్లీ గా కొనసాగిందట. ప్రస్తుతం విజయ్ బీస్ట్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు మాస్టర్ సినిమా తో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విజయ్ బీస్ట్ సిజిమతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు.

  Thalapathy Vijay and Dhoni who happened to meet in a Chennai studio

  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఇక విజయ్ కు జోడీగా మొదటిసారి పూజ హెగ్డే గ్లామరస్ పాత్రలో కనిపించబోతోంది. మాఫియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ పాత్ర కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. ఇక తెలుగులో కూడా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మాస్టర్ సినిమాతో టాలీవుడ్ లో మంచి వసూళ్లను అందుకున్న విజయ్ ఇక నుంచి రెగ్యులర్ గా తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి బెస్ట్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Thalapathy Vijay and Dhoni who happened to meet in a Chennai studio
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X