twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కడే కూర్చుని రాత్రంతా ఏడ్చాడు.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ బెస్ట్ ఫ్రెండ్!

    |

    స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తమిళనాట ఓ సంచలనం. ఒక్కొక్క చిత్రంతో నటుడిగా ఎదుగుతూ సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. ప్రముఖ దర్శక నిర్మాత ఎస్ఏ. చంద్రశేఖర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయినా కూడా విజయ్ కెరీర్ ఆరంభంలో కష్టాలు తప్పలేదని అతడి బెస్ట్ ఫ్రెండ్ అయిన టివి నటుడు సంజీవ్ వెల్లడించాడు.

    తమిళ సూపర్‌స్టార్ విజయ్‌కి ఇంటర్నేషనల్ అవార్డుతమిళ సూపర్‌స్టార్ విజయ్‌కి ఇంటర్నేషనల్ అవార్డు

    తండ్రి దర్శత్వంలోనే

    తండ్రి దర్శత్వంలోనే

    విజయ్ నటించిన తొలి చిత్రం నాలయ తీర్పు. 1992 లో విడుదలైన ఈ చిత్రానికి విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు. కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం విజయ్ పై పలు విమర్శలు కురిసేలా చేసింది.

    రాత్రంతా ఏడ్చాడు

    రాత్రంతా ఏడ్చాడు

    సంజీవ్ మాట్లాడుతూ.. విజయ్ తొలి చిత్రం విడుదలైన తరువాత పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఓ మ్యాగజైన్ లో నాలయ తీర్పు గురించి కథనం ప్రచురించారు. ఆ కథనం విజయ్ ని విమర్శిస్తూ ఉంది. విజయ్ లుక్, నటన ఏమాత్రం బాగాలేవని ప్రచురించారు. ఆ మ్యాగజైన్ చూసి విజయ్ రాత్రంతా ఏడ్చాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో సంజీవ్ తెలిపాడు.

    చివరకు వాళ్ళే

    చివరకు వాళ్ళే

    ఆ తరువాత విజయ్ తనని తాను మెరుగుపరుచుకుంటూ విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. చివరకు ఆ మ్యాగజైన్ వాళ్లే విజయ్ ని కవర్ పేజీలో ప్రచురించారు అని సంజీవ్ తెలిపాడు.

    మురుగదాస్ దర్శత్వంలో

    మురుగదాస్ దర్శత్వంలో

    ప్రస్తుతం విజయ్ తమిళంలో తిరుగులేని స్టార్ హీరో. విజయ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ మురుగదాస్ దర్శత్వంలో సర్కార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Thalapathy Vijay cried all night because of this reason. Vijay's close friend Sanjeev reveals how the Tamil star was shattered by the criticism he got during the initial stages of his career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X