»   »  డాక్టర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతోంది

డాక్టర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'కుంగుమ పూవుం కొంజపురావుం' చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తెలుగు నటి తనన్య. ఆంధ్రకు చెందిన డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ విజయలక్ష్మి దంపతుల కుమార్తె అయిన ఈమె వృత్తిపరంగా డాక్టర్‌. అయితే నటనపై ఆసక్తి పెరగడంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Thananya to tie knot with a Doctor

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆమె నటించిన 'వెయిలోడు విలయాడు' చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఆర్యన్‌తో మే ఒకటో తేదీన వివాహం జరుగనుంది. చిత్ర పరిశ్రమలోని స్నేహితులకు, బంధువుల కోసం హైదరాబాద్‌లో విందు ఏర్పాటు చేశారు.

ఇంతకీ ఎవరీ తనన్య అనుకుంటున్నారా? నిర్మాత,గాయకుడు ఎస్.పి.చరణ్ నిర్మించిన కుంకుమ పువ్వుం కొంజుం పురావుం చిత్రం గుర్తుందా? ఆ చిత్రంలో తులసిగా నటించిన అమ్మా యే ఈ తనన్య. నిజానికి ఈమె చదివింది వైద్య విద్య. అయితే మోడలింగ్ అంటే తనన్యకు చాలా ఆసక్తి. అలాంటిది ఊహించని విధంగా తనన్యకు హీరోయిన్ అవకాశం వచ్చింది.

Thananya to tie knot with a Doctor

దీంతో అనుకోని అవకాశాన్ని అందుకుని చూద్దాం అని కుంకుమ పువ్వుం కొంజుం పురావుం చిత్రంలో నటించారు. ప్రస్తుతం తనన్య నటించిన వెయిలోడు విళైయాడు చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే అంతకుముందే తనన్య పెళ్లిపీటలెక్కడానికి రెడీ అయ్యా రు. తనన్య పదహారణాల తెలుగమ్మాయి. తనే కాదు తల్లిదండ్రులు సుధాకర్, విజయ్‌లక్ష్మి డాక్టర్లే.

అంతేకాదు తనన్యకు కాబోయే వరుడు ఆర్య డాక్టర్ కావడం విశేషం. ఎంబీబీఎస్, ఎండీ ఎంఏ న్యూరో సూపర్ స్పెషలిస్ట్ ఆర్యన్‌తో నటి తనన్యకు మే ఒకటవ తారీఖున ఆంధ్రాలో వివాహం జరగనుంది.

English summary
Actress Thananya who acted in the film 'Kunguma Poovum Konjum Puravum' is to tie knot with a doctor.
Please Wait while comments are loading...