twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    N.Lingusamy: ది వారియర్ దర్శకుడికి జైలు శిక్ష.. ఆ కేసులో ఆరు నెలల శిక్ష వేసిన కోర్టు!

    |

    తమిళ చిత్రపరిశ్రమంలో మంచి మాస్ కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న డైరెక్టర్ లింగు స్వామి ఇటీవల రామ్ పోతినేనితో తెలుగులో దివారియర్ అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. అయితే ఈ దర్శకుడు గతకొంత కాలంగా ఒక కేసుతో సతమతమవుతున్నాడు. ఇక చెన్నై కోర్ట్ అతనికి జైలు శిక్ష విధించడం ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు లింగస్వామి ఏ విషయంలో ఈ తరహా శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే వివరాల్లోకి వెళితే..

    మాస్ డైరెక్టర్ గా

    మాస్ డైరెక్టర్ గా

    తమిళ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు మాస్ కమర్షియల్ సినిమాలతో లింగుస్వామి మంచి దర్శకుడుగా గుర్తింపు అందుకున్నాడు. అతను యాక్షన్ సినిమాలలో ఫైట్స్ సన్నివేశాలకు స్పెషలిస్ట్ గా పిలిచేవారు. మాస్ సినిమాల కంటే చాలా విభిన్నమైనా కమర్షియల్ సినిమాలు తెరపైకి తీసుకువచ్చి మంచి బాక్సాఫీస్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఆవారా సినిమాతో తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు.

    వరుస అపజయాలు

    వరుస అపజయాలు

    అయితే గత కొంతకాలంగా మాత్రం లింగస్వామి డైరెక్ట్ చేస్తున్న సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు. ముఖ్యంగా పందెం కోడి సినిమాతోనే అతని కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇక అదే సినిమాకు సీక్వెల్ గా పందెంకోడి 2 తీసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఏ హీరోతో చేసిన కూడా వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొంటూ వచ్చారు. అలాగే ఆర్థికంగా కూడా ఆయన కాస్త ఇబ్బంది పడినట్లు టాక్ వచ్చింది.

    అప్పు తీసికొని..

    అప్పు తీసికొని..

    అయితే ఇటీవల ఒక చెక్ బౌన్స్ కేసులో లింగస్వామి చట్ట పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో హీరో కార్తీ, సమంత జంటగా 'యెన్ని ఏలు నాల్' మూవీ రూపొందించడానికి లింగుస్వామి తన హోమ్ ప్రొడక్షన్ తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ లోనే ప్లాన్ వేశాడు. అయితే లింగుసామి తన అవసరాల నిమిత్తం పీవీపీ ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 1.35 కోట్లు అప్పుగా తీసుకున్నాడట. ఇక ఆ తర్వాత రూ. 35 లక్షలు పీవీపీ ఫైనాన్స్ కి చెక్ రూపంలో ఇచ్చినట్లు తెలుస్తుంది.

    ఆరు నెలలు శిక్ష

    ఆరు నెలలు శిక్ష

    అయితే లింగుస్వామి ఇచ్చిన రూ.35 లక్షల చెక్ బౌన్స్ అయ్యిందట. ఇక ఫైనాన్స్ కంపెనీ.. లింగుసామిపై కోర్టులో కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన అనంతరం న్యాయస్థానం.. దర్శకుడు లింగుసామికి 6 నెలల జైలు శిక్షను విధించినట్లు తెలుస్తోంది. అలాగే ఇవ్వాల్సిన డబ్బును వడ్డీతో పాటు చెల్లించాలని ఆదేశాలు కూడా అందాయి. ఇక సైదాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. లింగుసామి మద్రాస్ హైకోర్టుకు వెళ్లినట్లు సమాచారం.

    ఆర్థికంగా ఇబ్బందులు..

    ఆర్థికంగా ఇబ్బందులు..

    దర్శకుడు లింగస్వామి మొదట కొన్ని విభిన్నమైన సినిమాలతో కమర్షియల్ గా మంచి దర్శకుడు అనిపించుకున్నాడు. ఇక ఆవారా సినిమా తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ సొంత డిజాస్టర్ అయింది. అంతేకాకుండా నిర్మాతగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఆయన ఆర్థికంగా కూడా కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మరో కేసులో సతమతమవుతున్నారు. ఇటీవల రామ్ ది వారియర్ సినిమాకు కూడా ఇదే కేసు విషయంలో తమిళ్ రిలీజ్ లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.

    English summary
    The warrior Director N Lingusamy and his brother sentenced to 6 months imprisonment
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X