»   » ఫ్యాన్స్, నిర్మాత బెదిరింపులు: ఫ్లాఫైనా ఆడించాల్సిందే,నెక్ట్స్ సినిమాలు వద్దా?

ఫ్యాన్స్, నిర్మాత బెదిరింపులు: ఫ్లాఫైనా ఆడించాల్సిందే,నెక్ట్స్ సినిమాలు వద్దా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: పెద్ద సినిమాలు ఫెయిలైనప్పుడు క్రింద నుంచి పై స్దాయి దాకా దారుణమైన ప్రెజర్ ఉంటుంది. అప్పటిదాకా ఫ్రెండ్స్ కాస్తా విరోధులుగా మారి ఒకరిపై మరొకరు యుద్దం ప్రకటిస్తారు. ఇప్పుడు అదే పరిస్దితి తమిళంలో విజయ్ తాజా చిత్రం ధేరికి, తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్ కు కనపడుతోంది.

అయితే విజయ్ చిత్రం ప్రదర్శించే ఎగ్జిబిటర్స్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి , సినిమా ఫ్లాఫ్ మాకు పరిహారం ఇవ్వండంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఎగ్జిబిటర్స్, బయ్యర్లు మాత్రం సెలెంట్ పవన్ ని కలిసి తమ విన్నపాలు విన్నవించి, పరిహారం పొందాలనే ఆలోచనలో ఉన్నారు.

తమిళం విషయానికి వస్తే.. ఓ ప్రక్క విజయ్ తాజా చిత్రం ధేరీ టీమ్ మొత్తం చిత్రం విజయోత్సవాలు జరుపుకుంటూంటే, ఈ చిత్రం ప్రదర్శిస్తున్న ధియోటర్ ఓనర్స్ మాత్రం సినిమా ప్లాఫ్ అని తేల్చి చెప్తున్నారు.

తమిళనాడులోని టుట్టి కోరన్, కోవల్ పట్టై, తిరునవేలి, విరుధ్ నగర్, నాగర్ కోయిల్ ధియోటర్స్ యజమానులు మీడియాతో మాట్లాడుతూ తమకు ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి రికవరి అవటం కష్టం అని చెప్తున్నారు.


నిర్మాత కలైపులి ధాను మాత్రం తమ థేరి చిత్రం ఆరు రోజుల్లో వంద కోట్లు వరకూ వసూలు చేసిందని అఫిషియల్ గా ప్రకటన చేసారు. దాంతో ట్రేడ్ లో ఈ విషయమై పెద్ద కన్ఫూజన్ ఏర్పడింది. ధియోటర్ వాళ్లకు నష్టం వస్తూంటే వంద కోట్లు ఏమైనట్లు అంటున్నారు.

స్లైడ్ షోలో మిగతా డిటేల్స్...

సర్దార్ కు..

సర్దార్ కు..

భారీ డిజాస్టర్ టాక్ వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ కు యాభై కోట్లు షేర్ వచ్చిందని ప్రకటనలు వస్తున్నాయి. అయితే మరో ప్రక్క కలెక్షన్స్ పూర్తి డ్రాప్ అని ట్రేడ్ లో గోలెత్తుతున్నారు.

పవన్ కు చెప్తాం

పవన్ కు చెప్తాం

ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ పెట్టుకుని పవన్ తో ఈ విషయమై మాట్లాడాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

పరిహారం ఇస్తాం.

పరిహారం ఇస్తాం.

మరో ప్రక్క పవన్ ... తన వల్ల ఎవరూ నష్టపోవద్దని ఖచ్చితంగా పరిహారం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

రెమ్యునేషన్స్ వెనక్కి

రెమ్యునేషన్స్ వెనక్కి

గతంలో అఖిల్ సినిమా ఫ్లాఫ్ అయినప్పుడు దర్శకుడు వివి వినాయిక్ ..తన రెమ్యునేషన్ వదులుకుని పరిహారం ఇచ్చినట్లుగానే సర్దార్ కు కూడా క్లియర్ చెయ్యాలంటున్నారు.

శరద్ మరార్ మాత్రం

శరద్ మరార్ మాత్రం

నిర్మాత శరద్ మరార్ మాత్రం తన తదుపరి చిత్రంతో ఈ నష్టాన్ని పూడుస్తానని, ఇదే డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ సినిమా ఇస్తానని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఛానెల్స్ గోల

ఛానెల్స్ గోల

సినిమాకు ఫ్లాఫ్ టాక్ వచ్చినప్పుడు, ఎంతో పెద్ద మొత్తానికి శాటిలైట్ రైట్స్ తీసుకున్న టీవి ఛానెల్స్ మాత్రం గోలెత్తిపోతున్నాయి. తమ శాటిలైట్ ఎగ్రిమెంట్ లో డిస్కౌంట్ ఇవ్వమని నిర్మాత చుట్టూ తిరుగుతున్నాయి.

ధేరి విషయానికి వస్తే..

ధేరి విషయానికి వస్తే..

రిజల్ట్ సంగతి ప్రక్కన పెడితే ధేరి టీమ్ మాత్రం కేక్ కోసి మరీ చిత్రం విజయోత్సవం జరుపుకుంటోంది.

పరిస్దితి మారింది.

పరిస్దితి మారింది.

టుట్టికోరన్ లోని ధేరి చిత్రాన్ని ప్రదర్శిస్తున్న బాలకృష్ణ టాకీస్ ఓనర్ మాట్లాడుతూ.. మేము ప్రతీ సారి విజయ్ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తూంటాము. ఎందుకంటే అవి మినిమం గ్యారెటీ గా ఉంటాయి. కానీ గత కొంతకాలంగా పరిస్ధితి మారింది అన్నారు.

భయం

భయం


విజయ్ సినిమాలు వరస ఫ్లాఫ్ లు అవుతున్నాయి. దాంతో ఆయన సిమాలకు ప్రయారిటీ ఇవ్వాలంటే భయంగా ఉంది అన్నారు.

పులి సమయంలోనూ..

పులి సమయంలోనూ..

క్లియోపాత్ర అనే ధియేటర్ ఓనర్ మాట్లాడుతూ..పులికు ఏం జరిగిందో అందరికీ తెలుసు. కానీ పులి చిత్రాన్ని హిట్ చిత్రంగా చూపించే ప్రయత్నం చేసారు.

బెదిరిస్తున్నారు

బెదిరిస్తున్నారు


విజయ్ ఫ్యాన్ క్లబ్ లీడర్ మా ధియేటర్ కు వచ్చి మినిమం ఇరవై ఐదు రోజులైనా ప్రదర్శించాల్సిందే అని బెదిరించారు. అప్పుడు మాకు బాగా లాస్ వచ్చింది. ఇప్పటివరకూ దాన్ని ఎవరూ కాంపన్షేట్ చేయలేదు ." అన్నారు.

అందరిదీ ఇదే పరిస్దితి

అందరిదీ ఇదే పరిస్దితి

అంతేకాకుండా ధేరిని ప్రదర్శిస్తున్న మిగతా ధియేటర్ ఓనర్స్ కూడా కొంచెం అటూ ఇటూలో అలాంటి పరిస్ధితి ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు.

భయపెడుతున్న నిర్మాత

భయపెడుతున్న నిర్మాత

ధేరి విషయంలో మాకు నష్ట పరిహారం వస్తుందని భావించాం. అయితే ఇప్పుడు కబాలి చిత్రం ఎరగా చూపించి , ఆ రైట్స్ ఇవ్వమని మమ్మల్ని భయపెడుతున్నాడు నిర్మాత.

డెసిషన్ తీసుకున్నాం..

డెసిషన్ తీసుకున్నాం..

దాంతో ధేరీ నిర్మాత తదుపరి చిత్రాలు మా క్లియోపాత్ర ధియేటర్ లో వెయ్యకూడదని నిర్ణయించుకున్నాం అన్నారు.

నో రికవరీ

నో రికవరీ

రెండు వందల యాభై నుంచి మూడు వందలు దాకా టిక్కెట్ పెట్టి అమ్మినా ధేరి చిత్రం నష్టాలు నుంచి రికవరీ అయ్యే పరిస్ధితి లేదంటున్నారు ధియోటర్ ఓనర్స్.

ఎందుకిలా

ఎందుకిలా

ఇలాంటి సమస్య ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోంది అంటే.. భారీ రేట్లుకు సినిమాలను అమ్మటమే కారణం అంటున్నారు.

ఇంపాక్ట్

ఇంపాక్ట్

ఇప్పుడు పరిహారం ఇస్తే సరిపోదు..ఖచ్చితంగా ఇది భవిష్యత్ లో వచ్చే సినిమాలకు మార్గనిర్దేశనం చేసినట్లు అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

హీరోకు సంభంధం ఏంటి

హీరోకు సంభంధం ఏంటి

సినిమా హిట్టైతే మా హీరోకు ఏమన్నా ఎగస్ట్రా డబ్బు ఇప్పుడు ఫ్లాపైతే పరిహారం ఇవ్వమనటానికి అని అభిమానులు వాదిస్తున్నారు.

లోఫర్ గొడవ తేలలేదు

లోఫర్ గొడవ తేలలేదు

ఇదిలా ఉంటే పూరి జగన్నాధ్ తో లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ కు జరుగుతున్న వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

జాగ్రత్తగా

జాగ్రత్తగా

పెద్ద సినిమాలు ముఖ్యంగా స్క్రిప్టు విషయం నుంచి, ఓవర్ బడ్జెట్, ఓవర్ రెమ్యునేషన్స్ ఇలా.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. సినిమా ఫ్లాఫైతే ..ఎవరూ తమ డబ్బుని వదులుకోవటానికి ఇష్టపడటం లేదు.

English summary
Even as the entire team of Ilayathalapathy Vijay's Theri is celebrating the box office success of their latest release, theatre owners from places like Tuticorin, Kovilpatti, Tirunelveli, Virudhunagar and Nagercoil are left flabbergasted, according to a report.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu