»   »  కాలమారింది సామీ!

కాలమారింది సామీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
పద్మప్రియ చెంప చెల్లుమనిపించి ఇబ్బందుల్లో పడిన దర్శకుడు సామీ. ఇపుడు నా తప్పేంలేదంటున్నాడు. పద్మప్రియకు సారీ కూడా చెప్పిన సామి ఏ డైరెక్టర్ కు అయినా, హీరోయిన్ కు అయినా సెట్స్ లో ఇది మామూలే అంటున్నాడు. పద్మప్రియ ఆరోపించినట్టుగా తాను సెక్స్ వల్ గా ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, ఆమె చెప్పేదాంట్లో నిజంలేదని అంటున్నాడు. నిజం చెప్పాలంటే పద్మప్రియ చాలా రఫ్ గా ప్రవర్తిస్తుంది. తనకు తాను దర్శకురాలిననుకుంటుంది. ఏదేమైనా కౌన్సిల్ సినిమాను పూర్తిచేయడానికి అవకాశం ఇచ్చింది. పద్మ ప్రియతో తీయాల్సిన సీన్ లు దాదపు పూర్తయ్యాయి. పద్మప్రియతో ఇపుడు కూడా పనిచేయడానికి ఇబ్బంది పడనని సామీ అంటున్నాడు. పద్మప్రియ ఆరోపించిన సెక్స్ వల్ హరాస్ మెంట్ విషయంలో కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనని సామీ స్పష్టం చేశాడు. తప్పుగా ఆరోపణలు చేసినా వారికి సాయం చేసేలా చట్టాలుండడం మన దురదృష్టం అంటున్నాడు సామీ.

భారతీరాజా, బాలచందర్ లాంటి అగ్రశ్రేణి దర్శకులు సైతం తామనుకున్న నటన కనపరచకపోతే నటీనటులను కొట్టేవారు. తన ద్వారా తెరకు పరిచయం చేసిన భాగ్యరాజ్, పాండియన్, రతీ అగ్నిహోత్రి, రాధిక, రేవతిలను భారతీరాజా కొట్టడం జరిగింది. టవల్ తో తన నటులను కొట్టే అలవాటున్నవాడు కె.బాలచందర్. భారతీరాజా, బాలచందర్ చేతిలో ఆ రోజుల్లో దెబ్బలు తిన్నవారు ఆ దెబ్బలను ఆశిస్సులుగా భావిస్తే ఇపుడు మాత్రం గగ్గోలు పెడుతున్నారేంటని ఆశ్చర్యపోవడం సామి వంతయింది. కాలమారింది సామీ.

Read more about: padma priya sami
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X