»   » హారీస్‌ జయరాజ్‌కు కిడ్నాపర్ల బెదిరింపు, అరెస్టు

హారీస్‌ జయరాజ్‌కు కిడ్నాపర్ల బెదిరింపు, అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు హారీస్‌ జయరాజ్‌ను అపహరిస్తామంటూ డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ విషయం కోలీవుడ్ లో సంచలనం రేపింది. జయరాజ్ అభిమానులు సైతం ఈ విషయమై కంగారుపడ్డారు. అయితే అరెస్టుతో అంతా సర్దుకుంది.

పోలీసుల కథనం మేరకు హారీస్‌ జయరాజ్‌ నగరంలోని వలసరవాక్కంలో నివసిస్తున్నారు. ఈయన ఇంటికి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి తనకు వెంటనే రూ.20 లక్షల మొత్తాన్ని అందజేయాలని హెచ్చరించారు. తన డిమాండ్‌ను అంగీకరించకపోతే హారీస్‌ జయరాజ్‌ను అపహరిస్తామని బెదిరించాడు.

Three Held for Threatening to Kidnap Harris Jayaraj

ఈ విషయమై హారీస్‌ జయరాజ్‌ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేశారు. వారిని తిరునెల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన అరుణాచల పాండ్యన్‌ (25), ముత్తుకృష్ణన్‌ (32), తిరుమలై (32)గా గుర్తించారు. విచారణలో తిరుమలై ఇదివరలో హారీస్‌ జయరాజ్‌ తండ్రి వద్ద కారుడ్రైవరుగా ఉద్యోగం చేశాడని తెలిసింది.

English summary
Three men were arrested here today for allegedly threatening to kidnap popular Tamil film music composer Harris Jayaraj, police said. Hours after a complaint was lodged by Jayaraj's wife Suma that the accused threatened over phone that her husband would be kidnapped if the family did not pay Rs 20 lakh, police nabbed the three and seized a car used by them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu