Don't Miss!
- News
Lovers: ప్రియుడితో ఎంజాయ్, క్లైమాక్స్ లో గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే ?, ఇట్లావాళ్లతోనే కదా చివరికి !
- Finance
Titles: మరోసారి ఉద్యోగాల కోతకు అమెజాన్ సిద్ధం..
- Lifestyle
కాలం కలిసిరానప్పుడు ఈ పనులు అస్సలే చేయొద్దు, అవేంటంటే..
- Travel
జ్ఞానోదయ యాత్రకు కేంద్రాలు.. ఏపీలోని ఈ నాలుగు బౌద్ధ క్షేత్రాలు!
- Automobiles
రూ. 50 లక్షల ఖరీదైన కారు కొన్న యుట్యూబర్.. ఆ కారు ఏదో ఇక్కడ చూడండి
- Sports
Shubman Gill: జిడ్డు బ్యాటర్.. వద్దు బాబోయ్ అన్నారు! డబుల్ సెంచరీతో బల్లగుద్ది చెప్పాడు!
- Technology
ఈ ఫోన్ పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్! వివరాలు!
Vijay Vs Ajith నడిరోడ్డుపై దిల్ రాజు అంటూ వార్నింగ్.. తమిళ పాలిటిక్స్‌లో నలిగిపోతున్న స్టార్ ప్రొడ్యూసర్
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్‌గా దాదాపు 50 చిత్రాలకు నిర్మించిన దిల్ రాజుకు తన కెరీర్‌లో ఎన్నడూ ఎదుర్కొని సమస్యను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాడనిపిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన వారిసు (తెలుగులో వారసుడు) చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. అయితే వారిసు రిలీజ్ విషయంలో దిల్ రాజుకు తమిళ సినీ వర్గాలు అల్టిమేటం జారీ చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ వివారాల్లోకి వెళితే..

దిల్ రాజుపై ఎదురుదాడి..
తెలుగులో ఎదురులేని సామ్రాజ్యాన్ని నిర్మించిన దిల్ రాజు నేరుగా తమిళంలో సినిమాను నిర్మించడం తొలిసారి ఇదే. అయితే వారిసు సినిమా పోటీగా అజిత్ నటించిన తణివు చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నది. అయితే వారిసు విడుదల విషయంలో తమిళ సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న ఎదురుదాడి ఆయనను ప్రత్యేక సమస్యల్లో పడేసింది. తమిళంలో స్టార్ హీరో అయిన విజయ్ సినిమాకు థియేటర్లు దొరకకపోవడం పెద్ద సమస్యగాను, వివాదంగాను మారింది.

విజయ్, అజిత్ ఆధిపత్య పోరు
తమిళంలో
విజయ్,
అజిత్
మధ్య
ఆధిపత్య
పోరు
భారీగా
జరుగుతున్నది.
గతంలో
వీరిద్దరి
సినిమాలు
పోటాపోటీగా
రిలీజైనప్పుడు
తమిళనాడులో
అభిమానుల
మధ్య
యుద్ధవాతావరణం
కనిపించేది.
పలు
సందర్భాల్లో
విజయ్
ఫోటోకు
దండేసి..
RIP
అని
ట్రోల్
చేయడం,
అలాగే
విజయ్
ఫ్యాన్స్..
అజిత్‌ను
దారుణంగా
ట్రోల్
చేయడం
ఒక
ఫ్యాన్
వార్‌గా
మారిన
సందర్భాలు
భారీగానే
ఉన్నాయి.

దిల్ రాజు అసహనం
ఇలాంటి
సమయంలో
సంక్రాంతి
2023
తమిళనాడులో
అభిమానుల
మధ్య
భారీ
యుద్దానికి
తెర
లేస్తుందా
అనే
విషయం
ఇప్పుడు
సినీ
వర్గాల్లో
చర్చ
జరుగుతున్నది.
అయితే
విజయ్
సినిమాకు
తగినన్నీ
థియేటర్లు
లభించకపోవడంపై
దిల్
రాజు
అసహనం
వ్యక్తం
చేస్తున్నారు.
అయితే
విజయ్
స్టార్
హీరో..
కాబట్టి
ఎక్కువ
థియేటర్లు
ఇవ్వాలని
మేము
కోరుతాం
అని
దిల్
రాజు
ఇటీవల
ఇంటర్వ్యూలో
వెల్లడించారు.

విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్
అయితే
హీరో
విజయ్‌కి
డీఎంకే
పార్టీకి
మధ్య
పచ్చగడ్డి
వేస్తే
భగ్గుమనే
పరిస్థితి
తమిళనాడులో
ఉంది.
విజయ్
సినిమాకు
పోటీగా
అజిత్
నటించిన
తనివు
మూవీని
తమిళనాడు
సీఎం
స్టాలిన్
కుమారుడు
ఉదయనిధి
స్టాలిన్
రిలీజ్
చేస్తున్నాడు.
ఆ
కారణంగానే
విజయ్,
దిల్
రాజు
సినిమాకు
థియేటర్లు
లభించడం
లేదనే
ఓ
వాదన
వినిపిస్తున్నది.
ఇప్పుడు
రీల్
వారసుడు,
రియల్
వారసుడికి
మధ్య
పోరులో
దిల్
రాజు
నలిగిపోతున్నాడా
అనే
మాట
వినిపిస్తున్నది.

దిల్ రాజుకు తమిళనాడు వార్నింగ్
దిల్ రాజ్ పరిస్థితి దారుణంగా ఉంటే.. తమిళనాడు థియేటర్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసింది. విజయ్ నటించిన వారిసు సినిమాను దిల్ రాజు వాయిదా వేసుకోవాలి. విజయ్ సినిమా ద్వారా 400 కోట్లు రాబట్టడానికి భారీగా పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు సినిమా వాయిదా వేయకపోతే నడిరోడ్డుమీదకు వచ్చే అవకాశం ఉందని టీఎన్ థియేటర్ అసోసియేషన్ ట్వీట్ చేసింది. ఇక ముందు ఏం జరుగుతుందో అనే విషయం ఆసక్తిగా మారింది.