»   » సెక్స్ కామెడీ చిత్రం సూపర్ హిట్టయింది

సెక్స్ కామెడీ చిత్రం సూపర్ హిట్టయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: న్యూస్‌టుడే: జీవీ ప్రకాశ్‌ హీరోగా ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'త్రిష ఇల్లనా నయనతార'. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది మరెవరో కాదు తెలుగు బ్యూటీ ఆనంది.

మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ఈ రోజుల్లో..' చిత్రం ద్వారా ఓ చిన్న పాత్ర ద్వారా తెరంగ్రేటం చేసిన రక్షిత, ఆ తర్వాత మారుతి దర్శకత్వంలోనే వచ్చిన బస్ స్టాప్ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ వరుస ప్లాపులు అయ్యాయి. దీంతో తన పేరును ఆనందిగా మార్చుకుని తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరుస సక్సెస్‍‌లు తన ఖాతాలో వేసుకుంటోంది.

తాజాగా ఆమె నటించిన 'త్రిష ఇల్లనా నయనతార' చిత్రానికి యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సెక్స్ కామెడీ కాన్సెప్టుతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. డబుల్ మీనింగ్ డైలాగులు, క్రాస్ జోక్స్, హాట్ హాట్ లిప్ లాక్ సీన్లు, ఎక్స్ ఫోజింగ్ లాంటి మసాలా అంశాలను జోడించి యూత్‌లో వేడి పుట్టేలా గతంలో తమిళంలో ఎన్నడూ రాని విధంగా ఈ సినిమాను యమ హాటుగా తెరకెక్కించారు.

Trisha Illana Nayanthara Superhit

తన గత తమిళ చిత్రాల్లో కాస్త ఇన్నోసెంటుగా కనిపించిన ఆనంది, ఈ చిత్రంలో మాత్రం బోల్డ్ రోల్ తో ఆకట్టుకుంది. ఓ సీన్లో...ఆనంది క్యారెక్టర్ తన హీరోను ఇంటికి పిలుస్తుంది. అతనికోసం లిక్కర్ బాటిల్ ఓపెన్ చేస్తుంది. మందు కొడుతూ తినడానికి ఏదైనా సైడ్ డిష్ కావాలని హీరో అడగ్గా....కొరుక్కు తినడానికి తన బుగ్గలు(చీక్స్) ఉన్నాయిగా, ఇంకా వేరే ఎందుకు అనేలా సంకేతాలు ఇస్తుంది. దీన్ని బట్టి సినిమాలో హాట్ సీన్లు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

English summary
This Vinayaka Chavithi, Anandi's latest Tamil film, Trisha Illana Nayanthara, released to a great response from the young audiences. The film, a sex comedy which is said to be a bold take on youngsters' relationships, is full of crass jokes, steamy lip locks and bold portrayal of Tamil girls like never before.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu