For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రేజీ ఆఫర్ : స్టార్ హీరో సరసన త్రిష...నెగిటివ్ రోల్

By Srikanya
|

చెన్నై : స్టార్ హీరోయిన్ త్రిష వెండితెరపై అడుగుపెట్టి దశాబ్దం గడిచినప్పటికీ నేటి తరం హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. తమిళంలో అగ్రహీరోలు కమల్‌హాసన్‌, అజిత్‌, విజయ్‌, సూర్య, విక్రమ్‌, శింబు తదితరులతో నటించినప్పటికీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఆయన అల్లుడు ధనుష్‌తో నటించే అవకాశం మాత్రం ఆమెకు ఇప్పటి వరకు దక్కలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ధనుష్‌ చిత్రంలో నటించడానికి గతంలో ఓ అవకాశం వచ్చినప్పటికీ కాల్‌షీట్‌ సమస్యతో అది చేజారిపోయింది. ప్రస్తుతం వేల్‌రాజ్‌ నిర్మించే ఓ చిత్రంలో ధనుష్‌ సరసన త్రిష నటించనున్నట్లు తెలిసింది. 'ఎదిర్‌ నీచ్చల్‌', 'కాక్కిసట్త్టె' తదితర చిత్రాల వరుసలో సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలోని ఓ చిత్రంలో ధనుష్‌ నటించనున్నారు.

Trisha To Join Dhanush’s Next With Director Durai Senthilkumar

ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న ధనుష్‌ సరసన త్రిష, షామిలి జత కట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో త్రిష పాత్ర 'పడైయప్ప' (తెలుగు వెర్షన్‌ నరసింహ)లో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను తలపించేలా ఉంటుందని కోలివుడ్‌ వర్గాల సమాచారం. ధనుష్‌ తండ్రి పాత్రలో నటుడు విజయ్‌ తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ నటించనున్నారు.

త్రిష హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి దాదాపు 16 ఏళ్లవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర కథానాయకుల సరసన నటించి ఒక దశలో రెండు బాషల్లోనూ అగ్ర కథానాయికగా భాసిల్లింది. అయితే గత కొన్నేళ్లుగా త్రిషకు తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందట.

ఎంత మంది స్టార్ హీరోల సరసన నటించినా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఒక్క సినిమాలోనూ నటించలేకపోయానని త్రిష బాధను వ్యక్తం చేస్తోంది. ఆమె మాట్లాడుతూ హీరోయిన్ గా ఇన్నేళ్ల కెరీర్‌లో చేయని పాత్రలేదు. తెలుగు, తమిళ భాషల్లోని టాప్ స్టార్‌లతో కలిసి నటించాను.

Trisha To Join Dhanush’s Next With Director Durai Senthilkumar

ఒకే ఒక్క సినిమాలో అయినా రజనీ పక్కన నటించాలని ఆశపడుతున్నాను. ఆయన సరసన నటిస్తే కథానాయికగా నా కెరీర్ పరిపూర్ణమవుతుంది. ఇంత కాలం కథానాయికగా కెరీర్‌ని కొనసాగిస్తానని ఊహించలేదు.

మా కుటుంబ సభ్యులకు ఇష్టంలేకపోయినా వారిని ఒప్పించి సినిమాల్లోకి ప్రవేశించి నటిగా ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా వుంది. తొలిసారి చీకటి రాజ్యం చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాను. ఓ సందర్భంలో రివాల్వర్‌ని కూడా ఉపయోగిస్తాను. ఇందులో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నా పాత్ర వుంటుంది అని తెలిపింది.

English summary
Dhanush has joined hands with director Durai Senthilkumar for his next film. It is already known that Shamili will be seen playing the female lead in the film. Now, we hear that another actress will be joining the project soon. According to reports, Trisha Krishnan has been roped in by the director of the flick. She will be seen playing a crucial role in the film. Her character in the movie will be more of an antagonist. Reports suggest that the Yennai Arindhaa actress has agreed to play the negative character and will join the yet-to-be titled project.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more