For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో గోల : సినిమాని అడ్డుకోలేదు.. గొడవల్లోకి లాగద్దు

  By Srikanya
  |

  చెన్నై : కార్తి నటించిన 'కొంబన్‌'లో రెండు వర్గాల ఘర్షణలకు తావిచ్చే సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అన్ని సమస్యలనూ దాటుకుని బుధవారం ఈ చిత్రం విడుదలైంది. పుదియ తమిళగం పార్టీ అధ్యక్షుడు కృష్ణస్వామి చేసిన ఆరోపణలకు ఈ సినిమా దూరంగా ఉందని కూడా తేలింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ నేపథ్యంలో చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో తమిళ యంగ్ హీరో ఉదయనిధి పాత్ర కూడా ఉందని కోలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఆయన నటించిన 'నన్బేండా' సినిమాకు థియేటర్లు ఆశించిన స్థాయిలో దక్కలేదనే కారణంగానే ఇలా చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది.

  ఈ విషయమై ఉదయనిధి మాట్లాడుతూ.. 'నన్బేండా' విడుదల తేదీని నెల క్రితమే ప్రకటించాం. తర్వాతే 'కొంబన్‌'ను వచ్చే సమయాన్ని ప్రకటించారు. నా సినిమాను రాష్ట్రంలో దాదాపు 275 థియేటర్లలో తెచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఆ థియేటర్లలో ఎలాంటి మార్పూ లేదు. 'కొంబన్‌' ఎన్ని థియేటర్లలో వచ్చినా మా సినిమాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఈ సమస్యలోకి ఎందుకు నన్ను లాగుతున్నారో అర్థం కాలేదు. 'కొంబన్‌'ను అడ్డుకోవాల్సిన అవసరం నాకు లేదు''అని తెలిపారు.

  Udhayanidhi Stalin about Komban Issue

  'పరుత్తివీరన్ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోకార్తి. తర్వాత చాలా చిత్రాల్లో గ్రామీణ పాత్రల్లో నటించే అవకాశం వచ్చినా.. ఆయన ఒప్పుకోలేదు. ప్రస్తుతం ముత్తయ్య దర్శకత్వంలో ఆయన ఈ తరహా కథాంశంతో తెరకెక్కే 'కొంబన్‌' చిత్రంలో హీరోగా నటించారు. లక్ష్మీ మేనన్‌ హీరోయిన్. ఇందులో రాజ్‌కిరణ్‌ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం మొన్న బుధవారం విడుదలైంది.

  కార్తి మాట్లాడుతూ.. '' మదురై నేపథ్యంలో సాగే 'పరుత్తివీరన్‌'లో నటించిన తర్వాత అలాంటి అవకాశాలు చాలా వచ్చినా నిరాకరించా. ఆ సినిమాకన్నా గొప్ప సబ్జెక్ట్‌ వస్తే తప్ప నటించకూడదని నిర్ణయించుకున్నా. అప్పుడే ముత్తయ్య 'కొంబన్‌' కథ చెప్పారు. మామ, అల్లుడు మధ్య నడిచే అంశాల ఆధారంగా ఈ కథ అల్లారు. రామనాథపురం జిల్లా నేపథ్యంలో దీన్ని తెరకెక్కించాం. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని గ్రామంలో చిత్రీకరణ సాగింది.

  ఆ గ్రామస్తులు మాకు ఎంతో సహకరించారు. ఇందులో ఏ సినిమా ఛాయలూ కనిపించవని తెలిశాకే.. పలుసార్లు ఆలోచించి నటించేందుకు ఒప్పుకున్నా. తెరపై చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లక్ష్మీ మేనన్‌ గ్రామీణ యువతిగా, నూతన వధువుగా అద్భుతంగా నటించారు. రాజ్‌కిరణ్‌ నాకు మామ పాత్ర పోషించారు. ఆయన నటన సినిమాకు పెద్ద బలం. తమిళనాడు సంప్రదాయాలు, గ్రామీణ అందాలు నిండిన ఈ సినిమా తప్పకుండా నా కెరీర్‌కు గుర్తింపు తీసుకొస్తుంద''ని పేర్కొన్నారు.

  దర్శకుడు ముత్తయ్య ప్రసంగిస్తూ.. '' నా తొలిచిత్రం 'కుట్టిపులి' తల్లి సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో మామ, అల్లుడు మధ్య బంధం గురించి చెప్పా. నా తదుపరి సినిమాలు కూడా తప్పకుండా బంధుత్వాలు, అనుబంధాల మీదే ఉంటాయి. 'కొంబన్‌' నా ఇంటి కథ. మా తాత, నాన్నల జీవితం ఆధారంగానే దీన్ని రూపొందించాన''ని చెప్పారు. స్టూడియోగ్రీన్‌ బ్యానరుపై జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు.

  English summary
  Udhayanidhi Stalin denies his involvement in Komban controversy. Karthi and producer turned actor Udhayanidhi Stalin are the two leading stars compete at Box Office last week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X