For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్ళీ రేగిన వివాదం:తెలుగులోనూ చేసిన హీరోయిన్, లైంగికదాడి, అగ్రహీరో పేరు వినిపిస్తోంది

  |

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ మలయాళ నటిపై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. మలయాళ హీరోయిన్ మీద ఇటీవల కొచ్చిలో జరిగిన దాడి సౌత్ సినీ పరిశ్రమను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె కారులోనే కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించారు, అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీసారు. డబ్బు కోసం ఆమె వద్ద గతంలో పని చేసిన డ్రైవరే మరికొందరితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిట్టాడు. అప్పట్లో ఈ ఘటన దక్షిణాది సినీ ఇండస్ట్రీలని ఒక కుదుపు కుదిపింది.

  గెలిచే వరకూ పోరాడతా

  గెలిచే వరకూ పోరాడతా

  ఈ ఘటన కేవలం డబ్బు కోసమే చేసారని నేను భావించడం లేదు. కేవలం డ్రైవర్ కి ఇదంతా చేసే ధైర్యం ఉంటుందని నేను నమ్మడం లేదు. అలా అని ఈ ఘటన వెనుక నా శత్రువుల హస్తం ఉందని చెప్పడం లేదు. దీని వెనక ఎవరు ఉన్నారనే దానికి నాకు సమాధానం కావాలి. నేను గెలిచే వరకూ పోరాడతా అని అప్పట్లోనే ఆ హీరోయిన్ స్పష్టం చేసింది.

  మలయాళ ప్రముఖ నటుడు

  మలయాళ ప్రముఖ నటుడు

  ఇప్పుడు ఈ కేసు లో కీలకమైన సమాచారం వెలుగు చూసింది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు డబ్బులు ఇచ్చి తనతో ఈ పని చేయించాడని, అమె షెడ్యూల్‌ను ఓ ప్రముఖ దర్శకుడు తనకు అందజేశాడని కేసులో ప్రధాన నిందితుడైన‌ పల్సర్ సుని వెల్లడించాడు.

  జిన్సె అనే తోటి ఖైదీతో

  జిన్సె అనే తోటి ఖైదీతో

  ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లాలోని కక్కనాడ్ జైలులో సుని ఉన్నాడు. పోలీసుల విచారణ సందర్భంగా ఒక్క విషయమూ చెప్పని సుని.. జిన్సె అనే తోటి ఖైదీతో అన్ని వివరాలను పంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన తన స్నేహితులను కలిసేందుకు కొచ్చి వెళ్తుండగా మార్గమధ్యంలో నటిని అపహరించి దాడి చేయాల్సిందిగా ఓ మెగాస్టార్ తనతో బేరం కుదుర్చుకున్నాడని బయటపెట్టాడు.

  న్యాయమూర్తి ఎదురుగా

  న్యాయమూర్తి ఎదురుగా

  జిన్సె ద్వారా తాజాగా తెలిసిన వివరాల ఆధారంగా న్యాయమూర్తి ఎదురుగా పల్సర్ సుని వాంగ్మూలం రికార్డు చేస్తామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కొత్తగా తెరపైకి వచ్చిన వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇప్పుడు బయటకు వినిపిస్తున్న ఆహీరో మామూలు వాడు కాదు కాదు మల్లువుడ్ లో దాదాపు ఒక అగ్రహీరో స్థాయిలో ఉన్నవాడు కావటం కలకలం రేపుతోంది.

  అచ్చ తెలుగు అమ్మాయిలా

  అచ్చ తెలుగు అమ్మాయిలా

  'ఒంటరి' చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె అచ్చ తెలుగు అమ్మాయిలా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నితిన్ తో 'హీరో,' కృష్ణవంశీ , శ్రీకాంత్ ల కలయికలో వచ్చిన 'మహాత్మా,' రవితేజ 'నిప్పు' సినిమాలలో నటించింది. తెలుగులో అంతంత మాత్రపు అవకాశాలే వచ్చినప్పటికీ, మలయాళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాంటి నటి మీద, అదీ రద్దీగా ఉండే సిటీలో ఇలా జరటం దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి షాక్ గా మారింది... అసలింతకీ ఏం జరిగిందంటే

  కార్లో వెళుతుండగా

  కార్లో వెళుతుండగా

  షూటింగ్ ముగించుకుని త్రిసూర్ నుంచి కోచికి రాత్రి 9.30 గంటల సమయంలో ఆమె కార్లో వెళుతుండగా ఓ టెంపోలో ఆమె మాజీ డ్రైవర్ సునీల్ కుమార్, ఇతర గుర్తుతెలియని దుండగులు ఫాలో అయ్యారు. అథానీలోని నెదుంబసేరీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో దుండగులు ఆమె కారును టెంపోతో ఢీకొట్టారు.

  కార్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు

  కార్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు

  ఆ తర్వాత ఆమెను ప్రస్తుత డ్రైవర్ మార్టిన్‌‌తో కలిసి మాజీ డ్రైవర్ సునీల్ కుమార్ బలవంతంగా కార్లోకి ఎక్కి.. దాదాపు గంటన్నర పాటు ఆమెపై కార్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాదు.. ఫోన్లో ఆమె ఫొటోలు, వీడియోలు కూడా తీశారు. ఆమెను బెదిరించారు. తర్వాత వారు పళరివత్తం జంక్షన్ వద్ద దిగిపోయారు.

  డ్రైవర్‌ మార్టిన్‌

  డ్రైవర్‌ మార్టిన్‌

  వారు దిగిపోయాక అక్కడికి సమీపంలోనే నివసించే సినిమా నిర్మాత వద్దకు వెళ్లి జరిగిన సంఘటన గురించి వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కార్ డ్రైవర్‌ మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకడైన మణికందన్ ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలు వెల్లడించాడు.

  సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సుని

  సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సుని

  సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సునినే ఈ కుట్రకు ప్లాన్ గీశాడని, అతని స్కెచ్ ప్రకారమే నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన జరిగిందని తెలిపాడు. ఒక పని ఉందంటూ పల్సర్ సుని కాల్ చేసి తమను పిలిచాడని చెప్తూ.."ఎవరినో కొట్టేందుకు అతను పిలిచి ఉంటాడని నేను భావించాను..కానీ భావన మీద దాడి చేసేందుకు మమ్మల్ని పిలిచాడని తర్వాత తెలిసింది". అంటూ ఆ ఘటన తర్వాతి విషయాలను కూడా చెప్పాడు.

  30 లక్షలు తర్వాత ఇస్తానని ఒప్పించి

  30 లక్షలు తర్వాత ఇస్తానని ఒప్పించి

  నటిపై దాడి తర్వాత డబ్బు కోసం ఈ కుట్రలో భాగం పంచుకున్న ఇతర వ్యక్తులు డబ్బు కోసం సునితో గొడవ పడ్డారని, వారికి రూ.30 లక్షలు తర్వాత ఇస్తానని ఒప్పించి తర్వాత అడ్రస్ లేకుండా పోయాడని చెప్పాడు. తర్వాత పోలీసులకు పట్టుబడ్డ పల్సర్ సుని ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారటమే కాదు. ఈ దుశ్చర్య వెనక ఉన్న స్టార్ హీరో పేరుని కుఇఉడా బయట పెట్టాడట. మరి పోలీసులు ఈ విషయం లో ఎంతమేరకు నిజాయితీగా వ్యవహరిస్తారో చూడాలి..

  English summary
  Apparently, Pulsar Suni disclosed to an inmate about the deal he received from a Top Star to kidnap the Actress. He claims to have got to know information regarding Heroine's shooting schedules from a Director. Based on this info, Suni's Statement has been recorded in the presence of Magistrate.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X