twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వడివేలు షూటింగ్ కు ప్రజల నిరసన

    By Staff
    |
    Vadivelu
    వడివేలు ఇపుడు హీరో. హీరోగా రెండో సినిమాలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు చారిత్రక నేపథ్యం కలిగినవి కావడం విశేషం. మొదటి సినిమా హింసించే రాజు పులకేసి ఘనవిజయాన్ని అందించడంతో రెండో సినిమా అవకాశం వడివేలుకు లభించింది.

    పురాతన ఆదికేశవ పెరుమాల్ దేవాలయం శ్రీ పెరంబుదూర్ లో ఉంది. ప్రస్తుతం రూ.6 కోట్ల ఖర్చుతో ఆ దేవాలయం గోపురం మరమ్మతు, విమానం కు బంగారు ప్లేట్ల అమరిక పనులు జరుగుతున్నాయి. దీనితో ఉదయం తొమ్మిది గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులను లోనికి అనుమతించడంలేదు. కానీ వడివేలు హీరోగా రూపొందుతున్న ఇందిరలోగథిల్ న అఝగప్పన్ సినిమా షూటింగ్ కు మాత్రం అనుమతినిచ్చారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 500 మంది యూనిట్ సభ్యులను లోనికి అనుమతించారు. వారు చిత్ర షూటింగ్ ను జసాగిస్తున్నారు కూడా. సినిమా కోసం యాగగుండం, యాగసలాయి లను దేవాలయంలో ఏర్పాటు చేశారు. సినిమాకు సంబంధించి అన్ని అనుమతులు ఇస్తున్న దేవాలయ అధికారులు భక్తులను అనుమతించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనికి తోడు చిత్ర యూనిట్ సభ్యులు దేవాలయం చుట్టూ వేసిన అరటి తొక్కలు, చాయ్ త్రాగిన ప్లాస్టిక్ గ్లాసులను చూసిన భక్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. భక్తులు కొందరు మునిసిపల్ అధికారుల వద్దకు వెళ్లి సినిమా యూనిట్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారని గొడవకు దిగారు. తామేం ఇవ్వలేదని మునిసిపల్ అధికారులు సమాధానం ఇవ్వడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు, డిఎమ్కే నాయకులు రంగంలోకి దిగారు. దేవాలయంకు చేరుకున్నారు. సినిమా షూటింగ్ ను ఆపడానికి ఉపక్రమించారు. సినిమా యూనిట్ మాత్రం తాము హిందూ రిలీజియస్ బోర్డు అనుమతి తీసుకున్నామని స్పష్టం చేశారు. తాము షూటింగ్ ను నిలిపేది లేదని చెప్పారు. ఇది వివాదానికి దారితీసింది. భక్తులు, చిత్ర యూనిట్ సభ్యుల మద్య వాగ్వివాదం నెలకొంది. వివాదం మరింత పెద్దదవుతుండడంతో చిత్ర యూనిట్ ను షూటింగ్ ను నిలిపివేశారు. భక్తులూ శాంతించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X