Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
విజయ్ - వంశీ పైడిపల్లి సినిమాకు పవర్ఫుల్ సెంటిమెంట్... అదే నిజమైతే బాక్సాఫీస్ రికార్డులే..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి సారి తెలుగులో దర్శకుడితో గా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను తమిళంలో కూడా భారీస్థాయిలో తెరపైకి తీసుకు రాబోతున్నారు. టాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దిల్ రాజు ఎస్ వి సి ప్రొడక్షన్ లో నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం విజయ్ కు భారీ స్థాయిలో పారితోషికం కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. అయితే ఈ సినిమా విషయంలో విజయ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తిగా స్క్రిప్ట్ పనులను కూడా సిద్ధం చేసి ఉంచాడు. అయితే గతంలో మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా విజయ్ ఏ సినిమాలో అయినా సరే రెండు విభిన్నమైన పాత్రలో కనిపించాడు అంటే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది అని అభిమానుల్లో ఒక మంచి నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుందని కూడా నమ్ముతారు. వంశీ పైడిపల్లి తో చేయబోయే సినిమాలో కూడా అదే తరహాలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒక పాత్రలో పూర్తిగా యువకుడిగా కనిపించబోయే విజయ్ మరొక పాత్రలో మాత్రం వయసుమళ్ళిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని సమాచారం. రెండు పాత్రల మధ్య కొనసాగే సెంటిమెంట్ కూడా సినిమాలో చాలా హైలెట్ గా నిలుస్తుంది అని అంటున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాలో రెండు పాత్రలను కూడా పర్ఫెక్ట్ టైమింగ్ తోనే ప్రజెంట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి అనే స్క్రిప్టుని రెడీ చేశాడట. ప్రతీసారి విజయ్ నటన కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. అయితే ఈ సినిమాతో అవి రాకుండా అలాంటి కామెంట్స్ రావట. ఎందుకంటే విజయ్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకోడు అని నిత్యం చాలా ఈజీ గా ఉండే పాత్రలను చేస్తాడు అని కామెంట్స్ వస్తూ ఉంటాయి.
కానీ ఈ సినిమాతో మాత్రం నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండే పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక నిర్మాత దిల్ రాజు ఈ సినిమాపై బభారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాడట. ఏకంగా 90కోట్ల వరకు విజయ్ కు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు విజయ్ ఎప్పుడు కూడా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోలేదు. ఇక తెలుగులో కూడా ఇటీవల కాలంలో విజయ్ మార్కెట్ కూడా పెరుగుతోంది. గతంలో అతను చేసిన సినిమాలు బయ్యర్లకు పెట్టిన పెట్టుబడులకు మంచి ఆదాయాన్ని అంధించాయి. ఇక ఈ సినిమాను అయితే భారీ స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉందట. మరి విజయ్ ఏ రేంజ్ లో వసూళ్లను సాధిస్తాడో చూడాలి.