బిగ్‌బాస్‌పై అవాకులా? షో అంతా స్క్రిప్టే.. పిరికివాళ్లకు ఆ హక్కు లేదు.. ప్రత్యర్థులపై వనిత ఫైర్

బిగ్‌బాస్ రియాలిటీ షో అంతా స్క్రిప్టే అనే విమర్శలు, ఆరోపణలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే పదే పదే కంటెస్టెంట్లు, ఇతరులు అది స్క్రిప్టు కాదు అనే విషయాన్ని చెప్పినా అలాంటి సందేహాలు మళ్లీ మళ్లీ తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్, వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ మరోసారి బిగ్‌బాస్ గుట్టు విప్పారు.

తమిళ బిగ్‌బాస్ షో గురించి

తమిళ బిగ్‌బాస్ షో గురించి

ఇటీవల కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళ బిగ్‌బాస్ 4 సీజన్ మొదలైంది. అయితే రెండు వారాల షో కొనసాగిన తర్వాత అందులో కంటెంట్ చేసిన అనంతరం ఈ రియాలిటీ షో ముందస్తు తయారు చేసుకొన్న స్క్రిప్టు ప్రకారం జరుగుతున్నదనే ఆరోపణలు వచ్చాయి. అయితే అదే ప్రశ్నను వనితా విజయ్ కుమార్‌కు ఓ నెటిజన్ సంధించగా.. వనితా విజయ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ముఖానికి ముసుగేసుకొని అంటూ

ముఖానికి ముసుగేసుకొని అంటూ

బిగ్‌బాస్ తమిళ్ 4 గేమ్ ఆడాల్సిన ఆట మాత్రమే. సెలబ్రిటీల నిజస్వరూపం బయటపెట్టే ఓ షో. ముఖానికి ముసుగేసుకొని గేమ్ స్ట్రాటజీ చేద్దామనుకొంటే కుదరదు. బిగ్ బాస్ షోను ఓ గేమ్‌గా మాత్రమే చూడండి. అంతేగానీ రియల్ జరిగే షోపై కోడిగుడ్డుపై ఈకలు పీకేందుకు ప్రయత్నించకండి. మీ పరిధిలో మీరు తీర్పు ఇవ్వకండి అంటూ అని వనితా విజయ్ కుమార్ అన్నారు.

గేమ్ ఏంటో తెలియకుండానే

గేమ్ ఏంటో తెలియకుండానే

బిగ్‌బాస్ తమిళ్ షోపై వస్తున్న రివ్యూలను చూస్తే బాధగా ఉంది. బిగ్‌బాస్ రాస్తున్న రాస్తున్న కథనాలు ఉడికి ఉడకని వంటగా కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న వారికి అందులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆ ఇంటిలో ఎలా గేమ్ ఉంటుందో, ఎలాంటి పరిస్తితులు ఉంటాయో మాకు మాత్రమే తెలుస్తాయి అని వనితా విజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు.

కొందరు పిరికివాళ్లు అవాకులు, చెవాకులు

కొందరు పిరికివాళ్లు అవాకులు, చెవాకులు

బిగ్‌బాస్ తమిళ రియాలిటీ షోను విమర్శించే వారిపై వనితా విజయ్ కుమార్ మండిపడ్డారు. బిగ్‌బాస్ షో గురించి తెలియని కొందరు అమాయకులు తమకు ఇష్టం వచ్చినట్టు అవాకులు, చెవాకులు పేలుతున్నారు. అలాంటి షోలో పాల్గొనే ధైర్యం లేని పిరికివాళ్లకు మాట్లాడే అర్హత లేదు. వారంతా తమ సొంత డబ్బాలతో తప్పుడు సమాచారం అందిస్తున్నారు అని వనితా విజయ్ కుమార్ పేర్కొన్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Gangavva Is Out Of Bigg Boss Game
ప్రత్యర్థులను వనితా విజయ్ కుమార్ టార్గెట్ చేశారా?

ప్రత్యర్థులను వనితా విజయ్ కుమార్ టార్గెట్ చేశారా?

అయితే వనితా విజయ్ కుమార్ ట్విట్టర్‌లో చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆమె తనకు ప్రత్యర్థులుగా ఉన్న కొందరు యూట్యూబర్లను టార్గెట్‌గా చేసుకొని విమర్శనాస్త్రాలను సంధించారనే విషయాన్ని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే వనితా విజయ్ కుమార్ వ్యాఖ్యలపై ఆమె ప్రత్యర్థులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X