For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పీటర్ పచ్చి తాగుబోతు.. భరించలేను.. గోవాలో అలా.. ఎలిజబెత్‌‌కు క్షమాపణ.. వనిత యూటర్న్

  |

  తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ వనితా విజయ్ కుమార్ వ్యక్తిగత, వైవాహిక జీవితం మరోసారి ఇబ్బందుల్లో పడింది. ముచ్చటపడి చేసుకొన్న మూడో వివాహం కూడా బెడిసికొట్టింది. మూడో పెళ్లి చేసుకోవడం ద్వారా మానసికంగా ఇబ్బందికి గురిచేసినందుకు గాను తన మూడో భర్త పీటర్ పాల్ భార్య ఎలిజబెత్‌కు క్షమాపణ చెప్పడం తమిళ మీడియాలో చర్చనీయాంశమైంది. తన మూడో పెళ్లిని కూడా రద్దు చేసుకొంటున్నట్టు ఆమె అధికారికంగా వీడియోలో వెల్లడించడం మరో వివాదంగా మారింది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఏం చెప్పారంటే...

  వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి

  వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి

  తమిళ పరిశ్రమలో సాంకేతిక నిపుణుడు పీటర్ పాల్‌తో పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత ఆమె అతడిని మూడో భర్తగా స్వీకరిస్తూ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవడం అత్యంత వివాదామైంది. విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో పెళ్లి చేసుకోవడంపై వనితా విజయ్ కుమార్‌‌పై పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం తెలిసిందే.

  మూడోపెళ్లిపై సెలబ్రిటీలతో వివాదం

  మూడోపెళ్లిపై సెలబ్రిటీలతో వివాదం

  వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకోవడంపై తమిళ మీడియాలో కొందరు నటీనటులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో వనితా విజయ్ కుమార్ అనేక వివాదాలను, సమస్యలను ఎదుర్కొన్నారు. సినీ ప్రముఖులతో గొడవ పడటం, సోషల్ మీడియాలో దాడికి దిగడం లాంటి అంశాలు టెలివిజన్ సీరియల్‌గా సాగాయి. తాజాగా వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి బెడిసి కొట్టిందని తమిళ నిర్మాత రవిందర్ చంద్రశేఖర్ బయటపెట్టడంతో సంచలనంగా మారింది.

  మూడో భర్త పీటర్‌ను తన్ని తరిమివేసిందని

  మూడో భర్త పీటర్‌ను తన్ని తరిమివేసిందని

  నిర్మాత రవిందర్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై వనితా విజయ్ కుమార్ స్పందిస్తూ.. నా వైవాహిక జీవితం మరోసారి సమస్యల్లో కూరుకుపోయింది. పీటర్ పాల్ తాగుడు వ్యవహారం భరించలేనంతగా మారిపోయింది. అతడి తీరుతో తన వ్యక్తిగత జీవితం కూడా ప్రమాదంలో పడింది అంటూ మీడియాకు వెల్లడిస్తూ.. ఎలిజబెత్‌, ఆమె కుమారుడుకి పీటర్ విషయాన్ని వెల్లడించింది.

  భరించలేనంతగా మద్యానికి బానిస

  భరించలేనంతగా మద్యానికి బానిస

  పీటర్ మద్యానికి బానిస అనే విషయం ఆయన కుమారుడు చెప్పేంత వరకు తెలియదు. అతడి తాగుడు భరించలేనంతగా ఉంటుందనే విషయం నాకు తెలియదు. విపరీతమైన తాగుడు కారణంగా పీటర్ గుండెపోటుకు గురై హాస్పిటల్‌లో చేరాడు. ఆ తర్వాత డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా సిగరెట్లు విపరీతంగా తాగడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన ఆరోగ్యం కోసం దాదాపు 15 లక్షల రూపాయాల వరకు ఖర్చుచేశాను. ఆ తర్వాత కూడా లాభం లేకుండా పోతున్నది అని వనితా విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

  గోవాలో పీటర్ అలా

  గోవాలో పీటర్ అలా

  పెళ్లి తర్వాత కుటుంబంతో కలిసి గోవాకు విహారయాత్రకు వెళ్లాం. అక్కడ ఉండగానే పీటర్ సోదరుడు మరణించాడనే వార్త తెలిసింది. దాంతో ఆయన మరింత తాగుడుకు అలవాటు పడ్డారు. అక్కడి నుంచి చెన్నైకి వచ్చిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. ఆయన మద్యానికి బానిసయ్యాడనే విషయంపై మరింత క్లారిటీ వచ్చింది. అందుకే తన ఇంటికి రానివ్వలేదనే విషయాన్ని వెల్లడించారు.

  ఎలిజబెత్‌కు క్షమాపణలు

  ఎలిజబెత్‌కు క్షమాపణలు


  తాను మూడో పెళ్లి చేసుకొని పీటర్ భార్య ఎలిజబెత్‌కు సమస్యలు సృష్టించాను. ఆమెను మనో వేదనకు గురిచేశాను. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. పీటర్ ప్రవర్తనతో ఆమె ఎన్ని కష్టాలు అనుభవించిందో నాకు ఇప్పుడు అర్ధమవుతున్నది. పీటర్ మద్యం వ్యసనం ఆమె కాపురంలో ఎలాంటి కలతలకు గురిచేసిందో అర్ధం చేసుకోగలను అంటూ వనితా విజయ్ కుమార్ పేర్కొన్నారు.

  ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాను

  ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాను

  తనకు మూడో పెళ్లి కూడా అదృష్టాన్ని తీసుకురాలేకపోయింది. ఇక పీటర్ విషయంలో జోక్యం చేసుకోను. ఇప్పటి వరకు వారి జీవితంలో జోక్యం చేసుకొన్నందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఈ పెళ్లి వల్ల, పీటర్ వల్ల ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోయాను. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాను అంటూ వనితా కుమార్ తాజా వీడియోలో స్పష్టం చేశారు.

  English summary
  Bigg Boss fame, Tamil actress Vanitha Vijayakumar take u turn over her third marriage. She rendered apology to Elisabeth Helen over Peter paul's alcholic addiction. She released a video and rendered an apology to Elisabeth Helen that if she had hurt her in any way she is sorry for that.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X