twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్షోభంలో విజయ్ సర్కార్.. కొంపముంచుతున్న 'కోమలవల్లి'.. జయలలిత కోణం!

    |

    Recommended Video

    Vijay Sarkar Movie Goes Into Controversial

    వివాదాలు లేకుండా తమిళ స్టార్ హీరో విజయ్ చిత్రాలు విడుదల కావేమో. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విడుదలకు ముందే కాపీ కథ అంటూ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు సర్కార్ చిత్రం రాజకీయ రగడగా మారింది. మెర్సల్ చిత్రాన్ని మించే వివాదాలతో సర్కార్ సంక్షోభం దిశగా సాగుతోంది. మెర్సల్ చిత్రంలో కేంద్ర ప్రభుత్వం పై వేసిన సెటైర్లు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కాగా సర్కార్ చిత్రంలో ఓప్రతి నాయకిగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర సెగలు రేపుతోంది.

    సర్కార్ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్సర్కార్ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    పొలిటికల్ డ్రామా

    పొలిటికల్ డ్రామా

    ఓటు హక్కు దుర్వినియోగం కబడుతోంది అనే విషయం అందరికి తెలిసిందే. కానీ సర్కార్ చిత్రంలో దీనివెనుక రాజకీయ నాయకులూ ఎలాంటి కుట్రలు పన్నుతారు, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడం వలన దొంగ ఓట్లు ఎలా పడతాయి అనే అంశాలని ఉత్కంఠ భరితమైన పొలిటికల్ కథతో చూపించారు. సర్కార్ చిత్రం మంచి వసూళ్ళని సాధిస్తోంది. మెర్సల్ చిత్రం అంతటి భారీ వసూళ్లు సాధించడానికి వివాదాలు కూడా కారణం అయ్యాయి.

    కేంద్రంపై సెటైర్లు

    కేంద్రంపై సెటైర్లు

    మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దు, వైద్య విధానం తదితర అంశాలని సెటైరికల్ గా చూపించారు. కానీ సర్కార్ చిత్రంలో మురుగదాస్ రాష్ట్ర ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కమర్షియల్ అంశాలతో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మంత్రులే రంగంలోకి దిగారు.

     కొంపముంచుతున్న కోమలవల్లి

    కొంపముంచుతున్న కోమలవల్లి

    ఈ చిత్రంలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయకిగా నటించింది. ముఖ్యమంత్రి కుమార్తెగా ఎత్తుకు పైఎత్తు వేసే కోమలవల్లి పాత్రలో వరలక్ష్మి అద్భుతంగా నటించింది. కానీ ఆమె పాత్ర దివంగత ముఖ్యమంత్రి జయలలితని తప్పుగా చూపించే విధంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఏకంగా అన్నా డీఎంకే మంత్రులే రంగంలోకి దిగి సర్కార్ చిత్రానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

    జయలలిత అసలు పేరు

    జయలలిత అసలు పేరు

    జయలలిత ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలపై కూడా ఈ చిత్రంలో సెటైర్లు పడ్డాయి. ఇక తన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తండ్రిని కూడా హత్య చేసే కోమలవల్లిగా వరలక్ష్మి కనిపిస్తుంది. జయలలిత అసలు పేరు కూడా కోమలవల్లే. పతాక సన్నివేశాల్లోకోమలవల్లి వేషధారణ అంతా జయలలితని పోలిన విధంగా ఉంటుంది.

    వెంటనే తొలగించాలి

    వెంటనే తొలగించాలి

    తమిళనాడు మంత్రులురంగంలోకి దిగి కోమలవల్లి వివాదాస్పద సన్నివేశాల్ని వేంటనే తొలగించాలని హెచ్చరిస్తున్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు అని అంటున్నారు. విజయ్ లాంటి స్టార్ హీరో ఇలాంటి వివాదాస్పద చిత్రాలు చేయడం అవసరమా అంటూ అన్నా డీఎంకే మంత్రులు హెచ్చరిస్తున్నారు.

    విమర్శించే హక్కు ఉంది

    విమర్శించే హక్కు ఉంది

    తమిళనాడు న్యాయ శాఖా మంత్రి షణ్ముగం మాట్లాడుతూ.. కేవలం హీరో విజయ్ కి మాత్రమే కాదు.. సామాన్య పౌరుడికి సైతం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది. కానీ సర్కార్ చిత్రం హింసని ప్రేరేపించే విధంగా ఉందని ఆయన అన్నారు. ఈ చిత్రంలో భాగమైన ప్రతిఒక్కరిపై కేసులు పెడతామని మంత్రి హెచ్చరించారు. దీనితో సర్కార్ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది.

    English summary
    Varalaxmi Sarathkumar's role in Sarkar movie became controversial. TN Govt warn Vijay and Team
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X