»   »  చెన్నై వరదలకు 5 కోట్లు డొనేట్ చేసాడు

చెన్నై వరదలకు 5 కోట్లు డొనేట్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సౌత్ ఇండస్ట్రీ మోత్తం చెన్నై భాదితుల సహయనికి కృషి చెస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోక్కరుగా ఎవరికి తోచిన విరాళం వారికి ఇస్తున్నారు. ఇప్పటివరకు సినిమా హీరోల నుండి అత్యధికంగా విరాలం ఇచ్చినది (కోటి)రాఘవ లారెన్స్. ఇప్పుడు తాజాగా తమిళ హీరో విజయ్ 5 కోట్ల రూపాయలను విరాళాలంని చెన్నై వరద బాధితుల సహాయార్ధం అందచేశాడు.

తమిళనాడు రాష్ట్రం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇక చెన్నై నగరం భారీ వర్షాలు వరదలతో భారీగా నష్టపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చెన్నై కాలనీలన్నీ నీటితో నిండిపోవడంతో రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మంచినీరు, ఆహారం కోసం పజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్వచ్చంద సంస్థలు రంగంలోకి దిగి సేవలు అందిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ నుండి సినీ ప్రముఖులు ఇప్పటికే వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటించారు.

Vijay donated 5 crore rupees to Chennai flood relief fund

మన తెలుగు హీరోలు సైతం తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటించారు.రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కలిసి వరద బాధితులకు 15 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇవ్వడం జరిగింది.

మహేష్ బాబు చెన్నై వరద బాధితలకు రూ. 10 లక్షలు, జూ ఎన్టీఆర్ రూ. 10 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, రవితేజ రూ. 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. 50 వేల సహాయం చేసారు.

‘చెన్నై వరద బాధితులకు రూ. 25 లక్షల విరాళం అందించాలని నిర్ణయించుకున్నాను. నేను నా తొలి 18 ఏళ్ల జీవితం అక్కడే గడిపాను. నన్ను ఇపుడు మీ ముందు హీరోగా నిలబెట్టిన నగరం. ఐలవ్ యూ చెన్నై అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

English summary
Actor Vijay has announced to donated Rs. 5 crore for carrying out various relief works for the chennai flood victims.
Please Wait while comments are loading...