సంక్రాంతి గిఫ్టు: 265 గోల్డ్ చైన్స్ గిఫ్టుగా ఇచ్చిన హీరో
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల సంక్రాంతి సందర్భంగా తన తాజా సినిమా ‘పులి' కోసం పని చేస్తున్న సిబ్బంది కోసం 265 గోల్డు చైన్స్ గిఫ్టుగా ఇచ్చారట. ఈ విషయం తమిళనాట హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం విజయ్ ‘పులి' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.
ఈచిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్స్. అతిలోకసుందరం శ్రీదేవి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. పీరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ వైవిధ్యమైన బాణీలు అందిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తోంది. కాగా 'పులి' చిత్రంలో విజయ్, శృతి హాసన్‌లు కలిసి ఒక పాటను పాడుతారని చిత్ర సంగీతాన్ని దర్శకుడు దేవిశ్రీప్రసాద్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











