For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విజయ్‌కి పావురం దెబ్బ.. మెర్సల్ రిలీజ్ డౌటే.. సీఎంను కలిసినా ఫలితం లేదంట!

  By Rajababu
  |

  మెర్సల్ చిత్రం విడుదల ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఇలయతలపతి విజయ్ రంగంలోకి దూకాడు. విజయ్ నటించిన మెర్సల్ చిత్రం తెలుగులో అదిరింది టైటిల్‌తో విడుదలకు సిద్ధమవుతున్నది. అయితే కొన్ని సీన్లపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని విజయ్ కలవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

   దీపావళి కానుకగా మెర్సల్

  దీపావళి కానుకగా మెర్సల్

  దీపావళి కానుకగా మెర్సల్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాత ప్లాన్ చేశాడు. అయితే చిత్రంలో పావురాలను ఉపయోగించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. జంతు సంరక్షణ సంస్థల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్‌వోసీని) తీసుకురావాలని చిత్ర నిర్మాతలకు సూచించింది. ఇక ఈ వివాదమే కాకుండా మరో వివాదం కూడా మెర్స్ మెడకు చుట్టుకొన్నది.

   మెర్సల్ కథ నాదే

  మెర్సల్ కథ నాదే

  మెర్సల్ సినిమా కథ నాదే అంటూ ఓ వ్యక్తి మెర్సల్ నిర్మాతలపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దాంతో ఈ చిత్రం దీపావళికి విడుదల అవుతుందా లేదా అనే ప్రశ్న ప్రేక్షకులను వెంటాడుతున్నది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు రికార్డుస్థాయి వ్యూస్‌ను రాబట్టి భారీ అంచనాలను సినిమాపై పెంచింది.

   జీఎస్టీ బిల్లును నిరసిస్తూ

  జీఎస్టీ బిల్లును నిరసిస్తూ

  దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ బిల్లును నిరసిస్తూ తమిళ సినీ పరిశ్రమ ఆందోళన చేస్తున్నది. గతవారం కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడం గమనార్హం. తమిళ సినిమాలపై విధించిన 28 శాతం జీఎస్టీతోపాటు అదనంగా మరో 10 పన్ను విధింపుపై తమిళ పరిశ్రమ భగ్గుమంటున్నది.

   నిర్మాత సూచన మేరకు..

  నిర్మాత సూచన మేరకు..

  ఇలాంటి పరిస్థితుల్లో మెర్సల్ వివాదాన్ని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నిర్మాత సూచించడంతో విజయ్‌ తాజాగా సీఎం పళనిస్వామిని కలువడం జరిగింది అనే వార్త తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. సీఎంతో విజయ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయా? సీఎం ఏ మేరకు హామీ ఇచ్చాడు? దీపావళి పండుగ నేపథ్యంలో ఈ చిత్ర విడుదలకు మార్గం సుగమమైందా అనే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు మీడియా కథనాల్లో కనిపించలేదు.

   సీఎంతో విజయ్ భేటీ

  సీఎంతో విజయ్ భేటీ

  కాగా, మెర్సల్ రిలీజ్‌కు సంబంధించిన అంశాన్ని చర్చించేందుకు సీఎంతో విజయ్ భేటీ కాలేదు. వారిద్దరి మధ్య సమావేశానికి మెర్సల్ కారణం కానేకాదు అని మీడియాలో మరో కోణంలో కథనాలు ప్రసారమయ్యాయి. దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రంలో సమంత అక్కినేని, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ నటించారు. దర్శకుడు ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు.

  మెర్సల్‌కు విజయేంద్ర ప్రసాద్ కథ

  మెర్సల్‌కు విజయేంద్ర ప్రసాద్ కథ

  120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మన్ సంగీతం అందించారు. బాహుబలితో జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకొన్న కేవీ విజయేంద్ర ప్రసాద్ మెర్సల్‌కు కథ అందించడం విశేషం. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

  English summary
  Ilayathalapathy Vijay met Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami regarding the issues related to his forthcoming film Mersal. This comes after the CBFC alleged that they haven't certified the film yet. Vijay reportedly met the chief minister to discuss about the film's release. Reports also suggest that the producers requested Vijay to intervene. However, we await an official confirmation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X