»   »  రజనీని చూసి బుద్ది తెచ్చుకున్న హీరో!!

రజనీని చూసి బుద్ది తెచ్చుకున్న హీరో!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijay
కుశేలన్ పరాజయం చాలా మంది తమిళ హీరోలను ఆలోచనలో పడేస్తోంది. అక్కడ మెగా హీరోగా వెలగొందుతున్న విజయ్ తాజాగా Panthayam చిత్రంలో నటించారు. అతని తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఆ చిత్రంలో అతనిది...నిజ జీవిత పాత్ర.. అంటే రజనీకాంత్ కుశేలన్ లో చేసినట్లు స్టార్ హీరో పాత్ర అన్న మాట. అయితే ఆ పాత్ర నిడివి బాగా తక్కువ. తన అభిమానిని మోటివేట్ చేసే సన్నివేశాల్లో ఇందులో అతను కనిపిస్తాడు.

నితిన్ (తమిళ హీరో) విజయ్ కి పిచ్చి అభిమాని. అతను కొన్ని కష్టాల్లో పడి తనుండే షూటింగ్ స్పాట్ దగ్గరకు వస్తాడు. అప్పుడతనని తన తెలివితో రక్షిస్తాడు. అలాగే కుశేలన్ లో ఉన్నట్లే అభిమానులు అతన్ని చుట్టముట్టే అంశం కూడా ఉందిట. ఆ సన్నివేశంలో విజయ్ తో పాటు దర్శకుడు పేరరసు కూడా కనిపిస్తారు. ఇక ఈ విషయాన్ని బయిటకు తెచ్చి హైలెట్ చేసి మార్కెటింగ్ చేయద్దని...దానివల్ల హైప్ బాగా పెరిగి కుశేలన్ పరిస్ధితే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నాడుట. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా తనని చూపి ఎగ్జిబిటర్స్ కి అంటగట్టవద్దని చెప్పుతున్నాడు. అందుకే ఆ సినిమా ఆడియో పంక్షన్ కు కూడా అటెండు కాలేదుట. అందులోను అతని కురవై సినిమా ఫ్లాప్ మరింత జాగ్రత్తగా ఉండేలా ప్రేరేపిస్తోందిట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X