twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పేదపిల్లలకోసం, తన పారితోషికం మొత్తం ఇచ్చేసాడు: రియల్ "హీరో"

    తాను చేసిన ఒక యాడ్ కోసం అందుకున్న పారితోషికం మొత్తాన్నీ పేద పిల్లలకోసం ఇచ్చిన తమిళ హీరో విజయ్ సేతుపతి రియల్ లైఫ్ హీరోల జాబితాలో చేరి కోలీవుడ్ హాట్ టాపిక్ అయ్యాడు...

    |

    Recommended Video

    రియల్ "హీరో" అంటే నువ్వే..!

    సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతీ నటుడూ, నటి సాధారణం గా చెప్పే మాట "కళమీద ఉన్న ఇష్టం తోనే సినిమాల్లోకి వచ్చాను" అని, కానీ దాని వెనుక ఉన్న నిజం అందరికీ తెలిసిందే, ఎప్పటికప్పుడు తమ రెమ్యున రేషన్ల లెక్కలు చూసుకునే హీరోలు, హీరోయిన్లూ కొన్ని సార్లు మాత్రం ఆ డబ్బు ఎలావచ్చిందన్న ఆలోచన చేస్తారు. అప్పుడే వాళ్ళు సినీ హీరోలనుంచి రియల్ హీరోలు గా మారతారు...

     మన హీరోలు

    మన హీరోలు

    వరదలు, భూకంపాలూ వంటి ఉత్పాతాల సమయం లో మన హీరోలు విరాళాలు ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు, అయితే మన హీరోలకంటే ఎక్కువగా తమిళ హీరోలే ఈ విషయం లో ముందుంటారు, ఒక సంధర్భం అని ప్రత్యేకంగా లేకుండా వారు ఈ తరహా సహాయాలు చేస్తూనే ఉంటారు.

     విజయ్ సేతుపతి

    విజయ్ సేతుపతి

    సినిమాల్లోనే కాకుండా వివిద ఎండార్స్మెంట్లలో సంపాదించింది కూదా తమ అకౌంట్లలో జమ చేసుకునే హీరోలు ఉన్న సమయం లో తాను చేసిన ఒక యాడ్ కోసం అందుకున్న పారితోషికం మొత్తాన్నీ పేద పిల్లలకోసం ఇచ్చిన తమిళ హీరో విజయ్ సేతుపతి రియల్ లైఫ్ హీరోల జాబితాలో చేరి కోలీవుడ్ హాట్ టాపిక్ అయ్యాడు...

    అనిల్‌ సేమియా

    అనిల్‌ సేమియా

    ఓ కంపెనీ ప్రకటనలో నటించినందుకుగాను ఆయనకు అందిన రూ.50లక్షల పారితోషకాన్ని పేద విద్యార్థుల కోసం విరాళంగా ఇచ్చారు. తమిళనాడులోని 'అనిల్‌ సేమియా' కంపెనీకి ప్రచారకర్తగా ఇటీవలే విజయ్‌ సేతుపతి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థ తాజాగా ఐదు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

     తన పారితోషకం రూ.50 లక్షలు

    తన పారితోషకం రూ.50 లక్షలు

    దిండుగల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌ సేతుపతి పాల్గొని ఉత్పత్తులను లాంఛనంగా ఆవిష్కరించారు. ఆ సందర్భంగా తన పారితోషకం రూ.50 లక్షలను తమిళనాట విద్య, మౌలిక వసతుల కల్పనలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉన్న అరియలూర్‌లోని 774 అంగన్వాడీలకు రూ.5వేలు చొప్పున ఇచ్చారు.

     ఆహూతులు ఆశ్చర్య పోయారు

    ఆహూతులు ఆశ్చర్య పోయారు

    అంతేకాక 10 అంధుల పాఠశాలలు, 11 బధిర పాఠశాలలకు రూ.50వేలు చొప్పున విరాళంగా ఇచ్చారు. విజయ్‌ సేతుపతి చేసిన ఈ సహాయాన్ని చూసిన ఆహూతులు ఆశ్చర్య పోయారు. నేటి సినిమా హీరోలలో కొంత మంది యాడ్ రూపంలో కూడా భారీగా సంపాదిస్తున్నారు.

     విజయ్‌ సేతుపతి

    విజయ్‌ సేతుపతి

    కానీ సాయం చేయడంలో చాలా మంది సినిమా హీరోలు వెనకడుగు వేస్తున్నారని కొందరు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పీఎంకే నేత రాందాస్‌ సైతం విజయ్‌ సేతుపతిని ప్రశంసించారు. ఇలా తాము సంపాదించే కోట్లాది రూపాయల్లో ఎంతోకొంత సమాజానికి తిరిగి ఇచ్చే హీరోలు ఇంకా కొందరుంటే బాగుండు..

    English summary
    Actor Vijay Sethupathi has said he would donate a share of his remuneration towards the education of the needy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X