twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మురళీధరన్ బయోపిక్ విషయంలో విజయ్ సేతుపతి షాకింగ్ డిసిషన్.. గుడ్ బై చెబుతూ..

    |

    ఫైనల్ గా విజయ్ సేతుపతి మురళీధరన్ '800' బయోపిక్ నుంచి తప్పుకున్నాడు. గత కొంత కాలంగా ఈ బయోపిక్ కి సంబంధించిన వివదస్పద వ్యాఖ్యలు చాలానే వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పిన్ బౌలర్ గా క్రేజ్ అందుకున్న శ్రీలంక క్రికెటర్ కి సంబంధించిన జీవిత ఆధారంగా సినిమా చేయబోతున్నట్లు విజయ్ సేతుపతి ఇటీవల అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కకముందే ఎండ్ కార్డ్ పడింది.

    Recommended Video

    #ShameOnVijaySethupathi: Netizens Slams Vijay Sethupathi | Muralitharan Biopic '800 |Oneindia Telugu
    ఐదేళ్ల నుంచి బయోపిక్ పై చర్చలు

    ఐదేళ్ల నుంచి బయోపిక్ పై చర్చలు

    శ్రీలంక పేరును ప్రపంచానికి పరిచయం చేసిన అతికొద్ది మంది ప్రముఖులతో ముత్తయ్య మురళీధరన్ ఒకరు. తన స్పిన్ మాయాజాలంతో క్రికెట్ ఆటలో నెవర్ బిఫోర్ అనేలా టాలెంట్ ని బయటపెట్టాడు. ప్రపంచ దేశాలను అతని బౌలింగ్ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే గత ఐదేళ్లుగా అతని జీవితాన్ని వెండితెరపైకి తేవాలని కోలీవుడ్ లో కొందరు నిర్మాతలు చాలానే ప్రయత్నాలు చేశారు.

    ఒక్కసారిగా విమర్శలు రావడంతో

    ఒక్కసారిగా విమర్శలు రావడంతో

    ఇక ఫైనల్ గా స్క్రిప్ట్ పనులు దాదాపు ఎండ్ అయిన సమయంలో..800 సినిమా షూటింగ్ మొదలుపెడతారు అనగా వివాదాలు ఎక్కువయ్యాయి. నెటిజన్లు ఒక్కసారిగా విజయ్ సేతుపతి తమిళ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నాడు అంటూ అతన్ని బహిష్కరించాలని ఒక హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ అయ్యేలా చేశారు. భారతి రాజా వంటి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ బయోపిక్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

    స్పందించిన మురళీధరన్

    స్పందించిన మురళీధరన్

    శ్రీలంకలో తమిళ జనాలకు ద్రోహం జరుగుతున్నప్పుడు మురళీధరన్ కూడా అక్కడి ప్రభుత్వానికి మద్దతు తెలిపాడని, తమిళ్ జనాలకు అన్యాయం జరుగుతుంటే అంత ద్రోహం చేసిన వ్యక్తి బయోపిక్ ని తమిళనాడులోనే తెరకెక్కించడం కరెక్ట్ కాదని విమర్శలు వచ్చాయి. ఇక ఫైనల్ గా మురళీధరన్ కూడా ఈ బయోపిక్ ని తెరకెక్కించకపోవడమే మంచిది అంటూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశాడు.

    ఇబ్బందులను ఎదుర్కోవడం ఇష్టం లేదు

    ఇబ్బందులను ఎదుర్కోవడం ఇష్టం లేదు

    నాపై వస్తున్న విమర్శల గురించి తెలుసుకున్నాను. వాటి గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు కూడా.. విజయ్ సేతుపతి లాంటి మంచి భవిష్యత్తు ఉన్న నటుడు తన బయోపిక్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని చెబుతూ ఇలాంటి క్లిష్ట సమయంలో నా బయోపిక్ ని తెరకెక్కించకపోవడమే మంచిదని మురళీధరన్ లేఖలో పేర్కొన్నారు.

    సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి

    సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి

    ఇక విజయ్ సేతుపతి కూడా మురళీధరన్ అందించిన లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఒక్క ఒక్క పధంతో క్లారిటీ ఇచ్చేశాడు. థాంక్యూ గుడ్ బై.. అని చెప్పడంతో విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. కేవలం ఒక స్పోర్ట్ పర్సన్ జీవితంలోని బిన్నీమైన విషయాలను అందరికి స్ఫూర్తిని ఇచ్చేలా తెరకెక్కించాలని అనుకున్నాం.. కానీ ఈ సినిమా విషయంలో ఇలా వివధాలు చెలరేగడం ఆశ్చర్యాన్ని కలోగిస్తోందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.

    English summary
    Finally, Vijay Sethupathi Muralitharan dropped out of the '800 'biopic. Controversial comments about this biopic have been going viral for some time now. It is learned that Vijay Sethupathi has recently made an official announcement that he is going to make a film based on the life of a Sri Lankan cricketer who has gained craze as the number one spin bowler in the world. And finally the end card fell before the movie could be counted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X