లీకైన స్టార్ హీరో సినిమా కీలక సన్నివేశం!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం తలపతి 62. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. దీనితో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రంలో కీలకమైన బైక్ ర్యాలీ సన్నివేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసన్నివేశంలో కొంత భాగం లీకై ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సన్నివేశం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నప్పటికీ ఇకపై ఎలాంటి లీక్స్ జరగకుండా జాగ్రత్త పడాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

తమిళ అభిమానుల్లో విజయ్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం కోసం విజయ్ ఫాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయ్ సరసన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











