Don't Miss!
- News
తిరుమలలో కొత్త రికార్డు - భక్తులు నేరుగా ఈవోతో..!!
- Finance
budget 2023: విపక్షాలకు బడ్జెట్ రుచించిందా ? ఎవరి అభిప్రాయమేంటి..?
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varisu Vs Thunivu అజిత్ ఫ్యాన్స్‌కు విజయ్ షాక్.. వారిసు రిలీజ్ డేట్ మార్పు.. బాలకృష్ణకు లైన్ క్లియర్!
తమిళనాడులో సంక్రాంతి పండుగకు భారీ రచ్చకు తెరలేచింది. ఈ పండుగ సీజన్‌లో బద్ధ వైరుధ్యం ఉన్న అజిత్, విజయ్ ఫ్యాన్స్‌కు చేతినిండా పని దొరికింది. అజిత్ నటించిన తునివు (తెగింపు), విజయ్ నటించిన వారిసు (వారసుడు) దక్షిణాదిలో బరిలోకి దిగాయి. అయితే ఒకే రోజు పోటీ లేదనుకొన్న అజిత్ అభిమానులకు విజయ్ ట్విస్టు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఉన్న రిలీజ్ డేట్‌ను మార్పు చేసి నువ్వా? నేనా అనే సవాల్ విసిరారు. విజయ్ నటించిన వారిసు సినిమా రిలీజ్ డేట్ వివరాల్లోకి వెళితే..

అజిత్ ఫ్యాన్స్ Vs విజయ్ అభిమానుల
తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్, విజయ్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పలుమార్లు బాక్సాఫీస్ వద్ పోటీ పడిన ఈ స్టార్ హీరోలు మరోసారి సంక్రాంతి 2023కి తలపడేందుకు రెడీ అయ్యారు. గతంలో సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య వీర లెవెల్స్‌లో ట్రోల్స్ జరిగాయి. RIP Ajith అంటూ విజయ్ ఫ్యాన్స్, Vijay dead అంటూ అజిత్ ఫ్యాన్స్ బాహాబాహీకి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

జనవరి 11వ తేదీన వారిసు
అయితే 2023 సంక్రాంతికి విజయ్, అజిత్ మధ్య ఒకేరోజు పోటీ లేదని ప్రేక్షకులు ఊరట చెందారు. అజిత్ సినిమా జనవరి 11న రిలీజ్ అవుతుంటే.. విజయ్ సినిమా జనవరి 12 రిలీజ్‌కు డేట్లు ప్రకటించారు. అయితే విజయ్ అనూహ్యంగా తన సినిమా డేట్‌ను మార్పు చేసి.. జనవరి 11 తేదీకి షిఫ్ట్ చేశారు. దాంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి తెర లేచింది.

అజిత్ ఫ్యాన్స్‌కు షాక్
అయితే వారిసు రిలీజ్ డేట్ విషయంలో విజయ్ తీసుకొన్న నిర్ణయంపై సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. అన్ని విషయాలు పక్కన పెట్టి.. విజయ్ తన సినిమాను జనవరి 11వ తేదీన రిలీజ్ చేయాలని డిసైడ్ చేయడం అజిత్ ఫ్యాన్స్‌కు భారీ ట్విస్టు. విజయ్ భలే ఆట ఆడుతున్నాడు. డేట్ అనౌన్స్ చేయడం శ్మశానమంతా నిశ్శబ్దంగా మారింది అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నాడు.

ఒకే రోజు ప్రీమియర్లు వద్దు..
ఇక ఒకేరోజు అజిత్, విజయ్ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అభిమానులు జాగ్రత్త పడుతున్నారు. ఒకే రోజు ఇద్దరి హీరోల సినిమాల ప్రీమియర్లు ఒకే సమయంలో వేయవద్దు. స్పెషల్ షోలు వేయకుండా అడ్డుకోండి. ఒకవేళ వారిసు, తునివు సినిమా ప్రీమియర్లు ఇకేసారి వేస్తే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

పోటాపోటీగా అడ్వాన్స్ బుకింగ్ సేల్స్
ఇదిలా ఉండగా, వారిసు, తునివు సినిమాల అడ్వాన్సు బుకింగ్ కూడా పోటాపోటీగా మారింది. వారిసు చిత్రం అమెరికాలో 7 లొకేషన్లలో 30 షోల ద్వారా 1000 డాలర్ల వసూలు చేసింది. తునివు విషయానకిి వస్తే.. 18 లొకేషన్లలో 38 షోల ద్వారా 2100 డాలర్ల రూపాయలను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అంటే యూకే, ఫ్రాన్స్, శ్రీలంకలో ఈ చిత్రాలకు భారీ రెస్పాన్స్ వస్తున్నది.

బాలకృష్ణకు లైన్ క్లియర్
అయితే విజయ్ వారిసు తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 11 తేదీన రిలీజ్ అవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్‌కు ఊరట లభించింది. నైజాం, ఆంధ్రాలో దిల్ రాజు ఎక్కువ థియేటర్లలో వారసుడు రిలీజ్ చేస్తుండటంతో వీరసింహారెడ్డి చిత్రానికి కొంత ప్రతికూలంగా మారింది. వారిసు సినిమాను ఒక రోజు ముందు రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయం తీసుకోవడంతో కొంత మేరకు వీరసింహారెడ్డికి లైన్ క్లియర్ అయిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.