»   » బాలీవుడ్ బ్యూటీ తో కత్రినా తో విక్రమ్ రొమాన్స్..!

బాలీవుడ్ బ్యూటీ తో కత్రినా తో విక్రమ్ రొమాన్స్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విక్రమ్ హీరోగా నటించిన ఇటీవలి చిత్రాలన్నీ ప్లాపయ్యాయి. ప్రయోగాలు చేసినా, కమర్షియల్ చిత్రాల్లో నటించినా విక్రమ్ కి ఫలితాలు అనుకూలంగా రావడం లేదు. దీంతో స్పెషల్ ఎఫెక్ట్స్ ని నమ్ముకుని భారీ బడ్జెట్ చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 'కరికాలన్" అనే భారీ చిత్రంలో నటించేందుకు విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'రోబో మాదిరిగా హై బడ్జెట్ చిత్రమైన 'కరికాలన్" కి శంకర్ సినిమాలకి రెగ్యులర్ గా గ్రాఫిక్స్ చేసే కణ్ణన్ దర్శకత్వం వహిస్తాడు. విలక్షణమైన నటనతో వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు అయిన విక్రమ్ తో బాలీవుడ్ టాప్ హీరోయిన్ బ్యూటి కత్రిన ఖైఫ్ తో జోడి కట్టనున్నాడు. ప్రస్తుతం విక్రమ్ 'దేయివ తిరుమగాన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రంలో బాలల హక్కుల కోసం పోరాడే తండ్రిగా నటిస్తున్నాడు.

విక్రమ్ తన తరవాతి చిత్రాన్ని కన్నన్ దర్శకత్వంలో నటించటానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కత్రిన ఖైఫ్ నటించే అవకాశాలు ఉన్నాయి. భారి బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'కరికాలన్' అని పేరు పెట్టారు. సిల్వర్ లైన్ ఫిలింఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అధిక మొత్తంలో స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించనున్నారు. ఈ చిత్రం విషయంగా కత్రిన ను ఇంతవరుకు సంప్రదించలేదు కాకపోతే నిర్మాతలు కత్రిన అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతాన్ని హారిష్ జైరాజ్ అందించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేసే ఆలోచన ఉంది కాబట్టి కత్రినా హీరోయిన్ అయితే బెనిఫిట్ ఉంటుందని భావిస్తున్నాడు.

English summary
Tamil actor Vikram who is known for doing versatile roles is all set to romance Katrina Kaif in one of his future ventures. Vikram is currently starring in Deiva Thirumagan movie in which he plays the role of a retarded father who fights for rights over his child’s upbringing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu