»   » బుద్ధి మాంద్యంతో బాధపడే విక్రమ్..చేరదీసే అనుష్క

బుద్ధి మాంద్యంతో బాధపడే విక్రమ్..చేరదీసే అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu
విక్రమ్,అనుష్క కాంబినేషన్ లో రూపొందుతున్న తమిళ చిత్రం 'దైవ తిరుమగన్‌". ఈ చిత్రం త్వరలో తెలుగులోకి అనువాదం కానుంది. శివపుత్రుడు,అపరిచితుడు చిత్రాల తర్వాత విక్రమ్‌కు తెలుగులో విజయాలు లేకపోయినప్పటికీ అతని సినిమాలకు క్రేజ్ రావటం గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు.అంతకుమించి ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండడంతో ఈ చిత్రం అనువాద హక్కులకు డిమాండ్‌ ఏర్పడుతోంది. 'దైవ తిరుమగన్‌" అంటే తెలుగులో 'దేవుని బిడ్డ" అని అర్దం. ఈ చిత్రంలో విక్రమ్‌ బుద్ధిమాంద్యంతో బాధపడే కుర్రాడిగా నటించాడు. 'శివపుత్రుడు" చిత్రానికిగాను ఇప్పటికే జాతీయ అవార్డునందుకున్న విక్రమ్‌ ఈ చిత్రంలో మరోసారి అవార్డ్‌ విన్నింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ప్రదర్శించాడని చెప్తున్నారు. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.
English summary
vikram’s upcoming Tamil film Deiva Thirumagan, directed by Madarasapattinam fame Vijay, is also going to be dubbed in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu