For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విక్రమ్ 'ఐ' ఆడియో వేడుక (ఫొటోలు)

  By Srikanya
  |

  చెన్నై : శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ నటించిన 'ఐ' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో సోమవారం సాయింత్రం ఘనంగా జరిగింది. 'శంకర్‌.. మీరు అవకాశమిస్తే మీ చిత్రంలో నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నా' అని హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ తన మనోగతాన్ని వెల్లడించారు.

  ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్ద ఆస్కార్ ఫిలిమ్స్ నూట ఎనభై కోట్లతో , చాలా కాలం పాటు ఎంతో శ్రమించి నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా చేసారు. ఈ చిత్రం ట్రైలర్, ఫస్ట్ లుక్ లతో సినిమాపై పూర్తి అంచనాలు పెంచేసారు.

  ఆస్కార్ విజేత రహమాన్ అందించిన ఈ చిత్రం సంగీతం ఆవిష్కరణ..చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ వింత మృగం వేషం ధరించి వేదికపై ఒక పాటకు నటించటం విశేషం. సంగీత దర్శకుడు అనిరుధ్ సైతం ఆడియో ఆవిష్కరణ వేదికపై పాడారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో విడుదల చేయనున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్ తో కలిసి ఆస్కార్ సంస్దే విడుదల చేస్తోంది.

  స్లైడ్ షోలో ... ఫొటోలు

  అవిష్కరణ..

  అవిష్కరణ..

  కార్యక్రమానికి రజనీకాంత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడియో సీడీని విడుదల చేశారు. కన్నడ నటుడు పునీత్‌రాజ్‌కుమార్‌ తొలి సీడీని అందుకున్నారు.

  పాటకు ...

  పాటకు ...

  ఆడియో పంక్షన్ లో భాగంగా... విక్రమ్, అమీ జాక్సన్ ఓ పాటకు డాన్స్ చేసారు.

  రజనీ కాంత్...

  రజనీ కాంత్...

  ఈ ఆడియో పంక్షన్ కి రజనీ హాజరవుకావటంతో ఓ నిండుతనం వచ్చింది. రజనీ ఏం మాట్లాడతారో అని అంతా ఎదురుచూసారు.

   అమల, విజయ్

  అమల, విజయ్

  కొత్త దంపతులు అమలాపాల్, దర్శకుడు విజయ్ ఇలా ఈ పంక్షన్ లో మెరిసారు

  ఛీఫ్ గెస్ట్

  ఛీఫ్ గెస్ట్

  ఈ పంక్షన్ కి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఛీఫ్ గెస్ట్ గా హాజరవ్వటంతో దేశం మొత్తం దృష్టి ఈ ఫంక్షన్ పై పడింది.

  రజనీని ఆహ్వానిస్తూ...

  రజనీని ఆహ్వానిస్తూ...

  ఈ పంక్షన్ లో భాగంగా ..దర్శకుడు శంకర్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఆహ్వానించారు.

  ఆడియో ఆవిష్కరణ

  ఆడియో ఆవిష్కరణ

  ఇలా ఆడియోని అతిరధమహారధులంతా కలిసి ఆవిష్కరించారు.

  ఆకట్టుకున్న లుక్

  ఆకట్టుకున్న లుక్

  విక్రమ్ ..లుక్ ఈ పంక్షన్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతా దాని గురించే మాట్లాడుకోవటం జరిగింది

  ముగ్గురూ

  ముగ్గురూ

  ఓ ప్రక్క ఆర్నాల్డ్, రజనీకాంత్, దర్శకుడు శంకర్ తో కలిసి ఇలా కూర్చున్నారు.

  విక్రమ్

  విక్రమ్

  ఈ పంక్షన్ కి ప్రత్యేక ఆకర్షణ విక్రమ్. ఆయన కృషి,పట్టుదల,గెటప్ ల గురించే అంతా మాట్లాడుకున్నారు

  బీస్ట్ గా విక్రమ్

  బీస్ట్ గా విక్రమ్

  ఈ చిత్రంలో ఉన్న బీస్ట్ లుక్ తో విక్రమ్ ఇలా అందరికీ కనిపించి అలరించారు.

  ఆడియో లాంచ్

  ఆడియో లాంచ్

  ఈ మూవ్ మెంట్ కోసమే విక్రమ్, శంకర్ అభిమానులంతా నిన్నటి సాయింత్రం ఎదురుచూసింది

   అర్నాల్డ్‌ మాట్లాడుతూ....

  అర్నాల్డ్‌ మాట్లాడుతూ....

  ''భారతదేశంలో చాలా ప్రాంతాలకు వెళ్లాను. కానీ చెన్నైకి రావడం ఇదే ప్రథమం. వాస్తవానికి ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి అతిథిగా హాజరుకాలేదు. శంకర్‌ వద్ద ఓ సినిమా అవకాశం కోసం వచ్చాను. 'శంకర్‌ మీ దర్శకత్వంలో నాకు నటించాలనుంది. మీరు సరేనంటే మనిద్దరం కలిసి తదుపరి చిత్రం చేద్దాం 'కెనాన్‌ బిక్కింగ్‌' లాంటి సినిమా మనమెందుకు చేయకూడదు?' అని శంకర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.

  ఆర్నాల్డ్ కంటిన్యూ చేస్తూ...

  ఆర్నాల్డ్ కంటిన్యూ చేస్తూ...

  ''నేను ఓ బాడీబిల్డర్‌ దశనుంచి హీరోగా ఈ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉంది. చెన్నై ప్రజల అభిమానం చూసి నిజంగానే ఉప్పొంగిపోతున్నాను. తప్పనిసరిగా ఓ మంచి ప్రాజెక్టుతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకులను కలుస్తాననే నమ్మకం ఉంది'' అని ఆర్నాల్డ్‌ చెప్పారు.

  రజనీకాంత్‌ మాట్లాడుతూ....

  రజనీకాంత్‌ మాట్లాడుతూ....

  ''ఇప్పుడు శంకర్‌ 'ఐ' హాలీవుడ్‌పై పడిందని అనుకుంటున్నాను. భారతీయ సినిమా పరిశ్రమను హాలీవుడ్‌ స్థాయికి తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో శంకర్‌ ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ హాలీవుడ్‌ను తలపిస్తుంది. ఇక విక్రమ్‌లాంటి బాధ్యతాయుతమైన నటుడు మన దేశంలోనే కాదు, హాలీవుడ్‌లోనూ లేడనేది నా అభిప్రాయం. అంతగా విక్రమ్‌ ఈ సినిమా కోసం కష్టపడ్డాడు'' అన్నారు.

  దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ....

  దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ....

  ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు'' అన్నారు.

  విక్రమ్‌ మాట్లాడుతూ....

  విక్రమ్‌ మాట్లాడుతూ....

  ''శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ఆర్నాల్డ్‌ లాంటి హాలీవుడ్‌ నటుడు, రజనీకాంత్‌ ఈ కార్యక్రమానికి రావడం గర్వంగా భావిస్తున్నా''అన్నారు.

  English summary
  It was a day of Tamil movie I aka Ai, which set social media sites on fire. The audio release has become a talk of the town and has drawn the attention of whole of South India.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X