For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వారిని జైల్లో పెట్టే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు.. లాకప్ డెత్‌పై విశాల్, పా రంజిత్ ఫైర్

  |

  ప్రస్తుతం ఎక్కడైనా అన్యాయం జరిగితే అది నలుదిశలా వ్యాప్తి చెందుతుంది. ఒకప్పటిలా ఏదో మారుమూల కదా, అమాయకులు, మధ్య తరగతి వాళ్లు, చదువురాని వాళ్లు కదా అని అధికారులు చేసే అవినీతి, దుర్మార్గాలు ఎక్కువ వెలుగులోకి వచ్చేవి కావు. అయితే నేటి డిజిటల్ యుగంలో అంతా మారిపోయింది. మారుమూలన ఏం జరిగినా సరే అందరూ అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తమిళనాడులో జరిగిన ఓ ఘటనపై దేశం మొత్తం ఓ కన్నేసింది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

  అమాయకులపై పోలీసుల ప్రతాపం..

  అమాయకులపై పోలీసుల ప్రతాపం..

  పోలీస్ కస్టడిలో జయరాజ్, ఫినిక్స్ అనే తండ్రీ కొడుకులిద్దరూ పోలీస్ కస్టడీలో చనిపోయిన ఘటన ట్యూటికోరన్‌లో జరిగింది. లాక్ డౌన్‌లో తమ షాపును చెప్పిన సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచినందుకు పోలీసులు ఆ తండ్రీకొడుకులను కస్టడీలోకి తీసుకున్నారు. లాకప్‌లో చిత్ర హింసలు పెట్టారు. దీంతో వారిద్దరూ మరణించారు.

  ఆగ్రహ జ్వాలలు..

  ఆగ్రహ జ్వాలలు..

  వారికి న్యాయం జరగాలని తమిళ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో సెలెబ్రిటీలు కూడా ఒక్కొక్కరిగా జాయిన్ అవుతున్నారు. అయితే విదేశాల్లో ఎక్కడో జరిగే ఘటనలపై స్పందించే వారు ఈ విషయంలో మాత్రం అంతగా స్పందించడం లేదు. కానీ తమిళ నాడు, సోషల్ మీడియా మొత్తం పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

  వివరించిన సుచిత్ర..

  వివరించిన సుచిత్ర..


  తమిళ నాడులో జరిగిన ఈ ఘటన భాష వల్ల అందరికీ చేరడం లేదని, ఇంగ్లీష్‌లో వివరించింది. అసలు జరిగింది ఏంటి?పోలీసులు ఎంత క్రూరంగా ప్రవర్తించారో పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చింది. వారిద్దరి మోకాళ్లను, మోచేతులను విరగ్గొట్టారని, ఆపై వారి మొహాన్ని గోడకు కొట్టి పచ్చడి చేశారని తెలిపింది. థర్డ్ డిగ్రీలో భాగంగా వారి జననాంగాలలో కట్టలు, బాటిళ్లను దూర్చారని, రక్తం విపరీతంగా ప్రవహించిందని, వారిని అలాగే నగ్నంగా ఉంచారని పోలీసులు అకృత్యాలను వివరించింది. ఈ విషయాన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండనినెటిజన్లను కోరింది.

  ఇద్దరిని సస్పెండ్..

  ఇద్దరిని సస్పెండ్..


  ప్రజలు చేస్తున్న పోరాటంతో పోలీసులపై వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పటికీ ఈ ఘటనలో ఇద్దర్నీ సస్పెండ్ చేశారని, మరో ఇద్దర్నీ బదిలీ చేశారని తెలుస్తోంది. అయితే ఇది మాత్రమే సరిపోదని, న్యాయం జరిగే వరకు వదిలి పెట్టకూడదని నెటిజన్లు, సెలెబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విశాల్, పా రంజిత్ ఈ ఘటనపై తమ నిరసనను వ్యక్తం చేశారు.

  జైల్లో పెట్టాలి..

  జైల్లో పెట్టాలి..

  జయం రవి, జీవా, హన్సిక, కుష్భూ వంటి వారు ఈ ఘటనపై స్పందించారు. JusticeForJeyarajAndFenix అనే హ్యాష్ ట్యాగ్‌తో అందరూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశాల్ స్పందిస్తూ.. ‘సాధారణ ప్రజలమైన మాకు న్యాయం కోరే హక్కు ఉంది. అంత క్రూరంగా ప్రవర్తించినా ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు. ఇందులో ఉన్న ప్రతీ ఒక్కరిపై యాక్షన్ తీసుకుని జైల్లో పెట్టేవరకు ఊరుకునే ప్రసక్తే లేదు. ట్రాన్స్ ఫర్ చేయడమనేది నథింగ్. న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామ'ని చెప్పుకొచ్చాడు.

  కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
  సిగ్గుపడాలి..

  సిగ్గుపడాలి..

  దర్శకుడు పా రంజిత్ స్పందిస్తూ.. ‘పోలీస్ బలాన్ని ప్రయోగించడం, దాని ద్వారా టెర్రరిస్ట్‌లు మారకుండా చూసుకోవడం మన బాధ్యత. ప్రైవసీ, భద్రతలను పెంచండి.. సామాన్య పౌరుల మీద తమ ప్రతాపాన్ని చూపే పోలీసులు సిగ్గుపడండి' అని జయరాజ్, ఫీనిక్స్‌కు న్యాయం జరగాలని డిమాండ్ చేశాడు.

  English summary
  kollywood Demands Justice For Jeyaraj And Fenix In tuticorin. Vishal says that We, General Public have the right 2 know Y Injustice was meted out such level of Brutality This should not be forgotten til action is taken & the people involved are put in Jail Transfer means nothing, we will keep demanding till Justice is served
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X