ఆ సినిమా నా కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పద చిత్రం.. విశాల్
దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న నటుల్లో విశాల్ ఒకరు. సినిమాలే కాదు ఆయనకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ప్రజా సమస్యలపై తీవ్రంగా స్పందిస్తుంటారు. తమిళనాడులో ఉప ఎన్నికల సందర్భంగా అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఏదో కొన్ని కారణాల వల్ల ఆయన నామినేషన్ తిరస్కరించారనేది తెలిసిన సంగతి తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విశాల్ ప్రస్తుతం ఇరంబు థిరై చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో అభిమన్యుడు పేరుతో రిలీజ్ కానున్నది. ఈ చిత్రం విశాల్ కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పద చిత్రంగా మారుతునున్నదట. ఇదే విషయాన్ని ఆయన సంప్రదించగా..

అవును. అభిమన్యుడు చిత్రం నా కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పద చిత్రం. భావ ప్రకటిత స్వేచ్ఛతో ఆలోచింపజేసే చిత్రాన్ని రూపొందించాం. అందుకు మిత్రన్ థ్యాంక్స్. సమాజంపై నాకు ఉన్న ఆసక్తిని, కొన్ని ప్రతికూల పరిస్థితులపై నా కోపాన్ని సరైన రితీలో ఆయన తెరకెక్కించారు అని విశాల్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











