»   » విశాల్ 'కిలాడి' కథ హీరో సిద్దార్ధ రాసిందా?

విశాల్ 'కిలాడి' కథ హీరో సిద్దార్ధ రాసిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో సిద్దార్ధ రాసి, నటించిన చుక్కల్లో చంద్రుడు చిత్రం గుర్తుండే ఉంటుంది. ముగ్గురు అమ్మాయిలు చూసి వారిలో ఒకరిని ఎంపిక చేసుకునేందుకు అతను పడే తిప్పలే ఆ కథ సారాంశం. ఇప్పుడు అచ్చం ఇలాంటి కథతోనే విశాల్ హీరోగా చేసిన కిలాడి చిత్రం వస్తోంది. ఈ చిత్రం కథ గురించి కిలాడి దర్శకుడు తిరు మాట్లాడుతూ మా చిత్రంలో సిద్దార్ద ముగ్గురు అమ్మాయిలను పరిశీలించి వారిలో ఒకరిని చేసుకుంటారు. వారిలో ఒకరు చిననాటి గర్ల్ ప్రెండ్ అయితే మరొకరు క్రీడాకారిణి, మరొకరు కాలేజీ స్టూడెంట్, వేరొకరు సోషల్ యాక్టివిస్ట్. వీరి ముగ్గురుని వేరు వేరుగా పరచయం చేసుకుని వారితో రొమాన్స్ నడిపి వారి గురించి తెలుసుకుని ఒకరిని ఎంపిక చేసుకోవటమే కథ అని చెప్పాడు. దాంతో అది సిద్దార్ధ తయారుచేసుకున్న కథే. పాపం భాక్సాఫీస్ వధ్ద బోల్తా కొట్టింది అంటున్నారు. అయితే అంతకు ముందే ఇదే కథతో హీరో శ్రీకాంత్ తో దర్శకుడు వెంకీ నేను పెళ్లికి రెడీ అనే చిత్రం తీసాడన్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu