»   » ఆ హీరో పెళ్లి చేసుకుంటే, ఇండస్ట్రీలో అమ్మాయిలు సేవ్

ఆ హీరో పెళ్లి చేసుకుంటే, ఇండస్ట్రీలో అమ్మాయిలు సేవ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో హీరో విశాల్ ...ఓ గమ్మత్తైన కామెంట్ ని తన తోటి హీరో, క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆర్యపై చేసారు. ఆయన్ని మీడియావారు మీ వివాహం గురించి తర్వాత చెప్తురు..ముందు మీ ఫ్రెండ్ ఆర్య పెళ్లి గురించి చెప్పండి..ఆయన ఎప్పుడు చేసుకుంటారు అన్నారట.

దానికి విశాల్ స్పందిస్తూ... నేను కూడా హీరో ఆర్య పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటున్నాను.. ఎందుకంటే...పెళ్లి ఆయన మంచి కోసం కాదు..ఇక్కడుండే మిగిలిన అమ్మాయిలు మంచి కోసం అని కొంటె కోణంగిలా జవాబిచ్చాడు.

హీరో ఆర్యకు తమిళనాట ...మిస్టర్ మన్మధుడు అనే పేరు ఉంది. ఆయన ఎప్పుడు ఎవరో ఒకరికి లైన్ వేస్తూంటారని, తోటి ఆర్టిస్టులను వదలరని చెప్పుకుంటూంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే విశాల్ ఇలా కామెంట్ చేసాడన్నమాట.

విశాల్ తాజా చిత్రాల విషయానికి వస్తే...ఎంతోకాలంగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన...మదగజరాజా చిత్రానికి మోక్షం కలగనుందనేది కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. విశాల్, వరలక్ష్మి,అంజలి జంటగా నటించిన చిత్రం మదగజరాజా.

సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించింది.చిత్ర నిర్మాణం పూర్తయి చాలా కాలమైంది. ఒకసారి విడుదల తేదీ వెల్లడించి కూడా చిత్రం విడుదల కాలేదు. కారణం ఆర్థికపరమైన సమస్యలే.

Vishal Opens Up About Arya's Marriage!

అంతే కాదు మరోసారి చిత్ర హీరో విశాల్‌నే మదగజరాజా విడుదలకు ప్రయత్నించి విఫలమవడం గమనార్హం.అప్పట్లో కొందరు బయ్యర్లు చిత్ర విడుదలకు సహకరించక పోవడమే అందుకు కారణం అనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు మదగజరాజా చిత్రానికి మోక్షం కలిగిందని కోలీవుడ్ వర్గాల టాక్.

విశాల్ నటించిన తాజా చిత్రం కథకళి మంచి సక్సెస్ సాధించడం, అదే విధంగా దర్శకుడు సుందర్.సీ తాజా చిత్రం అరణ్మణై-2 చిత్రం విజయం సాధించడం మదగజరాజా చిత్రానికి హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నట్లు సమాచారం.
పక్తు కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్రంపై అప్పటిలోనే మంచి అంచనాలు నెలకొన్నాయన్నది గమనార్హం. విశాల్ ప్రస్తుతం మరుదు అనే చిత్రంలో నటిస్తున్నారు. కథకళి చిత్రం తరువాత విడుదలయ్యే చిత్రం మరుదునేనని భావిస్తున్న ఆయన అభిమానులకు మధ్యలో మదగజరాజా రానుండడం ఆనందమే అవుతుంది.

English summary
When asked when would Arya get hitched, Vishal said, "I wish he gets married soon, not for his own good but for the sake of all other girls living here."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu