»   » విశాల్ ‘కథాకళి’ అఫీషియల్ ట్రైలర్ (వీడియో)

విశాల్ ‘కథాకళి’ అఫీషియల్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విశాల్‌, కేథరిన్‌ త్రేసా జంటగా పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళచిత్రం 'కథాకళి' . ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్ ఇప్పటికే విడుదలై ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చాయి. ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పసంగా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. తాజాగా అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు.

నటుడు విశాల్ సొంత చిత్ర నిర్మాణం నెలకొల్పి పాండియనాడు, నాన్ శివప్పు మనిదన్, పూజై అంటూ వరుస చిత్రాలను నిర్మిస్తూ విజయాలను అందుకుంటున్నారు యువ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది.

Vishal's Kathakali Official Trailer

ఇప్పటి వరకు పసంగ, మెరీనా, వంశం అంటూ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజ్ తొలిసారిగా విశాల్ వంటి మాస్ హీరోతో యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ చిత్రంలో విశాల్‌ను ఎలా చూపించనున్నారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
Vishal Film Factory & Pasanga Productions presents "KATHAKALI", directed by Pandiraj & Music by Hip Hop Tamizha.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu