For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యతో విడాకులు కారణం అదే, ఆమెను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించా.. .. హీరో క్లారిటీ

|

తమిళ సినీ రంగంలో రాణిస్తున్న నటుడు విష్ణు విశాల్ తన భార్య రజనీ నుంచి విడాకులు తీసుకొంటున్నట్టు ప్రకటించడంతో అందరూ షాక్ తిన్నారు. ఎందుకంటే వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులుగా సుపరిచితులు. అంతేకాకుండా వారిద్దరూ ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకొన్నారు. అలాంటి భార్య,భర్తలు కోర్టు నుంచి విడాకులు తీసుకొని వేర్వేరుగా జీవించడం సన్నిహితులు, కుటుంబ సభ్యులకు అంతుపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల విష్ణు విశాల్ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

 జీవితమంతా అనిశ్చితమే

జీవితమంతా అనిశ్చితమే

జీవితంలో ఏదీ స్థిరంగా ఉండదనే విషయం నాకు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. లైఫ్‌లో ఎప్పుడైనా ఏదైనా జరుగొచ్చనే విషయం నా పెళ్లి, విడాకుల విషయంలో అర్ధమైంది. నా భార్య నుంచి నేను విడాకులు తీసుకొంటానని కలలో కూడా అనుకోలేదు. భగవంతుడు నిర్ణయమే అనుకొని బాధపడుతున్నాను అని విష్ణు విశాల్ అన్నాడు.

 నాపై అలా దుష్ప్రచారం

నాపై అలా దుష్ప్రచారం

రజనీ నుంచి విడాకులు తీసుకోవడం అనే విషయం నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది. నాపై రకరకాల దుష్ప్రచారం జరిగింది. 2011లో రజనీతో పెళ్లి జరిగేంత వరకు ఆమెతో నాకు బలమైన రిలేషన్ ఉండేది. మా రిలేషన్ ఇలా కావడానికి కారణం ఏమిటో ఇప్పటికీ నాకు అంతుపట్టడం లేదు అని విష్ణు విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

నేను మితభాషిని అందుకే

నేను మితభాషిని అందుకే

నా పర్సనాలిటీ విషయానికి వస్తే.. నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడను. నేను మితభాషిని. నా వ్యక్తిత్వం నా కెరీర్‌కు అవరోధంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాను. ఇప్పుడు అందరితో కలిసిపోవడానికి, ఇతరులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. స్క్రీన్ పైన రొమాన్స్ పండటానికి నేను ఇతరులను ఆటపట్టించడం. అమ్మాయిలతో చిలిపి చేష్టలు చేయడం చేస్తున్నాను అని విష్ణు విశాల్ పేర్కొన్నారు.

 భార్యతో విడాకుల కారణం అదే

భార్యతో విడాకుల కారణం అదే

నా వ్యక్తిత్వానికి భిన్నంగా నేను ఇతరులతో చనువుగా ఉండటమే నా విడాకులకు కారణమా? అనే అనుమానం కలుగుతున్నది. ఇతరులతో సన్నిహితంగా ఉండమే నా జీవితంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయని అనిపిస్తున్నది. నాలోని మార్పులే నాకు కష్టాలు తెస్తున్నాయా? ఆ కారణంగానే ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొన్నానా? అనే భావన కలిగిందా అనే సందేహాలు నన్ను వెంటాడుతున్నాయి.

నా కొడుకు మంచి భవిష్యత్తు కోసమే

నా కొడుకు మంచి భవిష్యత్తు కోసమే

నా భార్య రజనీ నుంచి విడాకులు తీసుకోవడమనే విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నా భార్య, కొడుకు మంచి జరుగాలంటే నేను ఆ కఠినమైన నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైంది. రజనీ అంటే ఇప్పటికీ ఇష్టం. ఆమె మంచి వ్యక్తి. కొన్నిసార్లు ఈ ప్రకృతి ఇద్దరు మంచిగా ఉండటం తట్టుకోలేదనిపిస్తుంది. నాపై ఉన్న అపోహలు తొలిగి రజనీ నన్ను ఇష్టపడటం మొదలుపెడుతుందేమో అని విష్ణు విశాల్ అన్నారు. విష్ణు విశాల్ నటించిన రాక్షసన్ సినిమా ఇటీవల ఘన విజయం సాధించింది. తెలుగులో రాక్షసుడు పేరుతో బెల్లంకొండ శ్రీను హీరోగా రూపొందుతున్నది.

English summary
In November 13, 2018, Tamil actor Vishnu Vishal announced that he and his wife Rajini have been separated for over a year before getting legally divorced. He also added that he'd continue to be good friends with her and respect her choices.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more