»   » 'రోబో' గురించి రజనీకాంత్ ఎందుకు మాట్లాడటం లేదు?

'రోబో' గురించి రజనీకాంత్ ఎందుకు మాట్లాడటం లేదు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో రిలీజ్ కానున్న సెన్సేషనల్ మూవీ 'రోబో' గురించి ఆ చిత్రం హీరో రజనీకాంత్ ఎక్కడా నోరు విప్పటం లేదు. ఇంటర్వూలకు ఎంత పెద్ద మీడియా సంస్ధలు వారు సంప్రదించినా సారి చెప్పుతున్నారు. అంతేకాదు..రోబో దర్శక,నిర్మాతలకు కూడా తాను ఇంటర్వూలు ఇవ్వబోనని చాలా స్పష్టంగా ఆయన చెప్పారని సమాచారం. అందుకే ఎక్కడా రోబో గురించి రజనీ చెప్పిన మాటలు రావటం లేదు. దీనికి కారణం ఏమిటి..ఏమన్నా మనస్సులో పెట్టుకున్నారా లేక విభేధాలా అంటే అదేమీ కాదంటున్నారు. ఇప్పటికే చిత్రానికి విపరీతమైన హైప్ వచ్చిందని ఇలాంటి పరిస్ధితుల్లో తాను గనుక సినిమా అలా వచ్చింది..ఇలా వచ్చింది అంటే ఆ అంచనాలు ఆకాశాన్ని దాటి పోయి ఓవర్ ఎక్సపెక్టేషన్స్ తో ధియోటర్ కి వచ్చి ఆ రేంజికి ఏ మాత్రం తగ్గినా నిరాశపడతారని అందుకే తానని పబ్లిసిటీ విషయంలో కలపవద్దని చెప్పారట. అలాగే సినిమా రిలీజై ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి తాను ఏం మాట్లాడాలో అది తప్పనిసరిగా చెప్తానని నిర్మాతలకు సున్నితంగా చెప్పారుట రజనీ. ఆయన స్టాటజీ కరెక్టుగా ఉన్నట్లుగా ఉంది. రిలీజ్ కు ముందు మీ జీవితంలో ఇలాంటి సినిమా చూసి ఉండరు అని రెచ్చగొట్టి తర్వాత మన తెలుగు రెగ్యులర్ సినిమాల్లా తుస్సుమనిపిస్తే సమస్యే కదా..దటీజ్ రజనీకాంత్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu