Just In
Don't Miss!
- Lifestyle
మీరు ఉదయాన్నే ఫోన్ చూస్తుంటారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...
- News
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదం
- Finance
మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
- Sports
Mohammed Siraj: బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న స్టార్ బౌలర్....!
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎందుకు మాట్లాడాలి? గొప్పగా ఏమీలేదు: రజనీకాంత్
హైదరాబాద్: రజనీకాంత్ సినిమాల్లో తప్ప మీడియాలో కనిపించేది చాలా తక్కువ. ఆయన గురించి వార్తలే తప్ప....ఆయన స్వయంగా మీడియాతో మాట్లాడటం చాలా అరుదు. ఆడియో ఫంక్షన్లు, ఇతరత్రా కార్యక్రమాల్లో మాత్రం సందర్భాన్ని అనుసరించి మాట్లాడతారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అసలు ఆయన ఎందుకు మీడియాతో అంతగా ఇంటరాక్ట్ అవ్వరు? అనే విషయానికి రజనీకాంత్ స్వయంగా సమాధానం ఇచ్చారు. ఈ విషయం గురించి రజనీకాంత్ మాట్లాడుతూ...‘మీడియాతో మాట్లాడటానికి నేనేమీ గొప్ప పనులు చేయలేదు. అలాంటపుడు మీడియాతో మాట్లాడటానికి ఏముంటుంది. నా గురించి నేను మీడియాతో మాట్లాడటం నాకు నచ్చదు' అంటూ సింపుల్ గా సమాధానం ఇచ్చారు తలైవర్.

‘కేవలం గొప్ప పనులు చేసిన వారు మాత్రమే ఆ విషయాలు చెప్పడానికి మీడియాను ఆశ్రయిస్తారు. నేను ఆ కేటగిరీకి చెందిన వాడిని కాదని నా భావన. నేనేమిటో నేను చేసే పనులే చెబుతాయి' అంటూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఆయన మాటలను బట్టి మీడియాకు దూరంగా ఉండటానికే రజనీకాంత్ ఇష్ట పడతారని తెలుస్తోంది.
రజనీకాంత్ హీరాగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ‘లింగా' చిత్రం డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రంపై భారీ అంచనాలతో డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేసారు. అయితే సినిమా సరిగా ఆడక పోవడంతో నష్టాల పాలయ్యారు.
గతంలో తన సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను రజనీకాంత్ ఆదుకున్నారు. ఈనేపథ్యంలో లింగా మూలంగా నష్టాల పాలైన తమను కూడా ఆదుకోవాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే రజనీకాంత్ నుండి కానీ, నిర్మాత నుండి కానీ ఎలాంటి స్పందన లేక పోవడంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు జనవరి 10న చెన్నైలోని వల్లూరు కొట్టం వద్ద స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకున్నారు.