Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రజనీకాంత్ కూతురు ఎమోషనల్ పోస్ట్: సరిగ్గా 8 ఏళ్ల క్రితం..
రజనీకాంత్ కూతురు సౌందర్య తన తండ్రి గురించి సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అయింది. కొచ్చాడయాన్ సినిమా షూటింగ్ సమయంలో రజనీ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి అప్పట్లో కాస్త ఆందోళనకరంగా ఉండటంతో అభిమానులు సైతం కంగారు పడ్డారు.
అయితే సింగపూర్లో చికిత్స అనంతరం రజనీకాంత్ పూర్తి ఆరోగ్యంతో ఇండియా తిరిగి వచ్చారు. కోట్లాది మంది అభిమానులు ఆయన బావుండాలని చేసిన ప్రార్థలు ఫలించాయి. రజనీ చెన్నైలో అడుగు పెట్టిన తర్వాత ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు.

మానాన్న నిజంగా దేవుడి బిడ్డ
8 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని రజనీకాంత్ కూతురు సౌందర్య గుర్తు చేసుకున్నారు. ఈ రోజు(జులై 13) మాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సింగపూర్లో అప్పకు ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత సరిగా ఇదే రోజు చెన్నై వచ్చాను. నువ్వు నిజంగానే దేవుడి బిడ్డవు నాన్న. నాన్న కోసం ఎంతో మంది ప్రార్థనలు చేశారు. మా కుటుంబం కోసం, నాన్న కోసం ఇంకా ప్రార్థనలు కొనసాగిస్తూనే ఉన్నారు. వారందరికీ థాంక్స్.... అని సౌందర్య తెలిపారు.

చికిత్స అనంతరం మరింత ఉత్సాహంగా
సింగపూర్లో చికిత్స పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రజనీకాంత్... వరుస సినిమాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తూ దూసుకెళుతున్నారు. చికిత్స తర్వాత ఆయన ‘కబాలి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు కాలా, పేట లాంటి హిట్ చిత్రాలు చేశారు. 2.0 లాంటి భారీ బడ్జెట్ మూవీలో నటించారు.

రజనీకాంత్ ఈ వయసులో కూడా
రజనీకాంత్
వయసు
ప్రస్తుతం
68
సంవత్సరాలు.
ఇప్పటికీ
ఆయన
ఎలాంటి
అలుపు
లేకుండా
ప్రేక్షకులను
అలరిస్తున్నారు.
యువ
హీరోలతో
పోటీ
పడుతూ
డాన్సులు,
ఫైట్లు
చేస్తూ
వరుస
విజయాలు
నమోదు
చేస్తున్నారు.

దర్బార్
ప్రస్తుతం రజనకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘దర్బార్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాలా ఏళ్ల తర్వాత రజనీ మళ్లీ పోలీసుగా కనిపించబోతున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా... సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, నివేతా థామస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.