»   » నా సినిమా హాలీవుడ్ కాపీ కాదు: శ్రీ రాఘవ

నా సినిమా హాలీవుడ్ కాపీ కాదు: శ్రీ రాఘవ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాకు తెలిసి కాపీ కొట్టడం కంటే కొత్తకథ రాసుకోవడమే చాలా సులువైన పని. నేటి ప్రేక్షకులు అన్ని రకాల, అన్ని భాషల చిత్రాలు చూస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్న చిత్రానికి గతంలో చూసిన చిత్రానికి ఏ మాత్రం పోలిక కనిపిం చినా..వెంటనే పసిగట్టేస్తున్నారు. అందుకే ఈ రోజు ల్లో కాపీ కొట్టడం చాలా కష్టమైన పని అంటున్నారు సెల్వ రాఘవన్. ఆయన దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ' ఆయరత్తిల్‌ ఒరువన్‌'ను తెలుగులో 'యుగానికి ఒక్కడు' పేరుతో డబ్బింగ్ చేసి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ తన చిత్రం కొంతమందికి ఏ హాలీవుడ్‌ చిత్రానికో కాపీ అనే సందేహం రావచ్చు. అయితే ఏ చిత్రానికి కాపీ కాదు..ప్రేరణ అంటూ ఏమీ లేదు. కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకులపై నమ్మకంతోనే ఈ చిత్రాన్ని తీశాను అని స్పష్టం చేసారు. తెలుగులో '7/జి బృందావన కాలని' చిత్రంతో పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు శ్రీ రాఘవ ఆ తర్వాత వెంకటేష్‌తో చేసిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'రూపొందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu