ఆ టెక్నిక్‌తో అమ్మాయిల్ని ట్రాప్... వాడికి చిక్కితే ... బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై మాజీ భార్య కామెంట్స్
ఇండియాలో బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రియాలిటీ షోల చరిత్రలోనే ట్రెండ్ సెట్టర్ అన్న గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో తొలుత ప్రారంభమై ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోకి విస్తరించి మరింత పాపులరైంది. నగర, అర్బన్ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు సైతం బిగ్‌బాస్ వెళ్లిందంటే మామూలు విషయం కాదు. అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.. బిగ్‌బాస్ షోపై వచ్చినన్ని విమర్శలు, జరిగిన వివాదాలు సినిమాల విషయంలోనూ జరగవంటే అతిశయోక్తి కాదు.
బిగ్‌బాస్ బ్రోతల్ హౌస్
అశ్లీల కంటెంట్‌తో పాటు యువతీ, యువకులను ఒకే చోట ఉంచడంపై సాంప్రదాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ నారాయణ వంటి వారైతే బిగ్‌బాస్‌ను బ్రోతల్ హౌస్ అన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. బిగ్‌బాస్‌ను నిషేధించాలని ఎన్నోసార్లు కోర్టులలోనూ పిటిషన్లు దాఖలయ్యాయంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు షోతో పాటు షో పాల్గొనే కంటెస్టెంట్స్ పైనా ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి. బయటి వ్యక్తులతో పాటు సొంత కుటుంబ సభ్యులు కూడా వీరిపై ఆరోపణలు చేశారు. తాజాగా ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై అతని మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్‌లో వివాదాస్పద వ్యక్తులు
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ హిందీ 19 ఈ ఏడాది ఆగస్ట్ 24న గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటి వరకు 8 సార్లు ఎలిమినేషన్లు జరగ్గా... 11 మంది హౌస్‌లో ఉన్నారు. ఈ వారం ఐదుగురు ఇంటి సభ్యులు నామినేషన్స్‌లో నిలిచారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఈసారి కూడా పలువురు వివాదాస్పద వ్యక్తులు హౌస్‌మేట్స్‌లో ఉండగా.. వీరిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అభిషేక్ బజాజ్.
సినిమాలు, సీరియల్స్‌తో పాపులర్
ఢిల్లీకి చెందిన అభిషేక్ పలు హిందీ సినిమాలలో నటించారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, చండీఘర్ కరే ఆషికి, బబ్లీ బౌన్సర్, కబాద్: కి కాయిన్ తదితర సినిమాలలో నటించారు. సినిమాలతో పాటు సంతోషి మా, సిసిలా ప్యార్ కా, దిల్ దేక్ దేఖో, జూబ్లీ టాకీస్ తదితర సినిమాలలో నటించారు. అలాగే వెబ్ సిరీస్‌లపైనా ఫోకస్ పెట్టి బాయ్స్ విత్ టాయ్స్, నామాకూల్ వంటి వెబ్ సిరీస్‌లలో మెరిశాడు అభిషేక్ బజాజ్. ఈ క్రమంలో 2017లో ఆకాంక్ష జిందాల్‌ను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు ఈ జంట సజావుగానే కాపురం చేసుకోగా.. ఆ తర్వాత విభేదాలు చోటు చేసుకోవడంతో 2019లో విడిపోయారు.
అతని డిక్షనరీలో సిగ్గు అనే పదం లేదు.
అనూహ్యంగా బిగ్‌బాస్ హిందీ 19లో అడుగుపెట్టి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అభిషేక్. ఆటలు, టాస్క్‌లు, మైండ్ గేమ్‌తో నామినేషన్స్‌లోకి వచ్చినా ప్రేక్షకుల ఓటింగ్‌తో గట్టెక్కుతున్నాడు. తాజాగా అభిషేక్‌పై అతని మాజీ భార్య ఆకాంక్ష సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుని అభిషేక్ తనను మోసం చేశాడని ఆరోపించింది. అతనిదంతా నటనే అని.. బిగ్‌బాస్‌లోకి వచ్చాక తన వయసు, పెళ్లికి సంబంధించిన వివరాలను దాచి పెట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. తనే కాకుండా ఎంతో మంది అమ్మాయిలు అభిషేక్ కారణంగా బలయ్యారు. ఎంతోమంది అమ్మాయిలతో అతనికి ఎఫైర్లు ఉన్నాయి.. అతని డిక్షనరీలోనే సిగ్గు అనే పదానికి చోటు లేదు.. అభిషేక్‌తో జాగ్రత్తగా ఉండాలని, అతని గురించి నిజాలు బయటకు రావాలని ఆకాంక్ష పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











