Just In
- 1 hr ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 2 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 3 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 4 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మాజీ సీజేఐ, ఎంపీ రంజన్ గొగొయ్‌కు జడ్ ప్లస్ వీఐపీ సెక్యూరిటీ
- Finance
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ..
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్ ట్విస్ట్: ఆ నెంబరే అభిజీత్‌ను గెలిపించబోతుంది.. బయటకు వచ్చిన సంచలన విషయం
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫినాలే స్టేజ్‌కు చేరుకుంది. ఐదుగురు కంటెస్టెంట్లు ట్రోఫీని ముద్దాడేందుకు పోటీ పడుతున్నారు. మరో ఐదు రోజుల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. కంటెస్టెంట్ల ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు ఓట్లు ఎక్కువ పడేలా ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగో సీజన్ విన్నర్ విషయంలో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం.. బిగ్ బాస్ విన్నర్ అయ్యేది అభిజీతే అంటున్నారు. అసలేంటీ సెంటిమెంట్? వివరాల్లోకి వెళ్తే...

మారుమ్రోగిపోతోన్న కంటెస్టెంట్ పేరు
ప్రస్తుతం బిగ్ బాస్ ఫినాలే వీక్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వాళ్లలో అభిజీత్ పేరే ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతోంది. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో రికార్డు మీద రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు ఓట్లు కూడా భారీగా వేస్తున్నారు. దీంతో చాలా వారాల పాటు సేఫ్ అయిన అతడు.. టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఫలితంగా బిగ్ బాస్ టైటిల్ రేసులో ఉన్నాడు.

ప్రైవేటు పోలింగ్‌లో మొదటి స్థానంలో
బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్‌తో పాటు ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్‌లు ఫినాలేలో ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే టైటిల్‌ను ఎగరేసుకుని పోతారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పోలింగ్ మొదలైంది. అప్పటి నుంచే ప్రైవేటు పోల్స్ కూడా మొదలయ్యాయి. వీటన్నింటిలోనూ అభిజీత్‌కే ఏకంగా యాభై శాతం పైచిలుకు ఓట్లు పడుతున్నాయి.

మొదటి సీజన్‌లో శివ బాలాజీ విన్
ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభమై ఘన విజయాన్ని అందుకుంది బిగ్ బాస్ మొదటి సీజన్. దీనిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. సో.. ఆ సీజన్‌లో ఎటువంటి ట్విస్టులు కనిపించలేదు. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ సీజన్‌లో ప్రముఖ నటుడు శివ బాలాజీ విజయం సాధించాడు. అతడు నామినేషన్స్‌లో తక్కువగా ఉన్నా.. చివర్లో ఓట్లను సంపాదించాడు.

రెండో సీజన్‌లో కౌశల్ మండా అలా
రెండో సీజన్ నుంచి పరిస్థితి మారిపోయింది. ఎన్నో వివాదాల నడుమ ప్రారంభం అయిన ఈ సీజన్‌లో కౌశల్ మండా విజయం సాధించాడు. కంటెస్టెంట్లు అందరూ టార్గెట్ చేయడంతో పాటు ఏకంగా 11 సార్లు అతడిని నామినేట్ చేయడంతో ప్రేక్షకుల్లో సానుభూతి పెరిగింది. దీంతో అన్నీ సార్లూ సేఫ్ అవడంతో పాటే బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్‌గానూ నిలిచి రికార్డులు క్రియేట్ చేశాడు.

మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్
అంతకు ముందు కౌశల్ ఎదుర్కొన్న పరిస్థితులనే మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ కూడా అనుభవించాడు. ఇతడు కూడా మిగిలిన కంటెస్టెంట్లతో తరచూ గొడవలు పడుతూ.. వివాదాలకు కేంద్ర బిందువులా మారాడు. ఈ కారణంగానే ఏకంగా 11 సార్లు నామినేట్ అయ్యాడు. ఇది అతడికి బాగా ప్లస్ అయింది. ఫలితంగా రాహుల్ మూడో సీజన్‌ను గెలుచుకుని సత్తా చాటాడు.

అదే అభిజీత్‌ను గెలిపించబోతుంది
ప్రస్తుత సీజన్ విషయానికి వస్తే.. కౌశల్ మండా, రాహుల్ సిప్లీగంజ్ మాదిరిగానే అభిజీత్ కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ సారి అతడే గెలుస్తాడని ఓ న్యూస్ బయటకొచ్చింది. దీన్ని అతడి ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు. మరోవైపు, కౌశల్.. గీతా మాధురి కారణంగా, రాహుల్.. పునర్నవి వల్ల నామినేట్ అవగా, అభి మాత్రం కంటెస్టెంట్లందరి వల్ల ఎలిమినేషన్ జోన్‌లోకి రావడం గమనార్హం.