Just In
- 29 min ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 44 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- Finance
మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
- News
శకటాల పరేడ్ వర్సెస్ ట్రాక్టర్ల నిరసన ప్రదర్శన: గణతంత్ర చరిత్రలో తొలిసారిగా: అసలు నిర్వచనం
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజీత్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం: బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టేస్తూ.. రికార్డ్ బద్దలయ్యేలా ఉందే!
తెలుగు బుల్లితెరలో బిగ్ బాస్ షో చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా.. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు ట్రెండ్ సెట్ చేయడం మరో రీజన్. ఈ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా తెగ పాపులర్ అయిపోతున్నారు కొందరు. ఈ క్రమంలోనే నాలుగో సీజన్ విన్నర్ అభిజీత్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. షో తర్వాత ఫుల్ బిజీ అయిన అతడు.. తన హవాను మాత్రం చూపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తన క్రేజ్‌ను చూపిస్తూ.. అభిజీత్ తాజాగా ఓ విషయంలో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఆ సంగతులు మీకోసం!

మూడు సినిమాలు.. మూడు సీజన్లు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'తో సినీరంగ ప్రవేశం చేశాడు అభిజీత్. ఆ తర్వాత ‘రామ్ లీలా', ‘మిర్చిలాంటి కుర్రాడు' అనే మూవీలను కూడా చేశాడు. వీటి వల్ల అతడికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం చేసిన ‘పెళ్లి గోల'కు మాత్రం మంచి స్పందన వచ్చింది. ఈ కారణంగానే ఇది మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. అదరగొట్టేశాడు
సినిమాల్లో పెద్దగా గుర్తింపు దక్కించుకోకున్నా.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో అభిజీత్. సాదాసీదా కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించిన అతడు.. షో ఆరంభంలో లవ్ ట్రాకులపై ఫోకస్ చేశాడు. అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కొన్ని టాస్కుల్లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా మైండ్ గేమ్‌తో మంచి మార్కులు కొట్టేశాడు.

నాలుగో సీజన్‌లో ఊహించిన ఫలితం
బిగ్ బాస్ నాలుగో సీజన్ మధ్య నుంచే ఈ సారి అభిజీత్ గెలుస్తాడన్న ప్రచారం మొదలైంది. అంతలా అతడికి బయట ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ కారణంగానే ఏకంగా 11 సార్లు నామినేషన్స్‌లో ఉన్నా సేఫ్ అవుతూ వచ్చాడు. ఇదే ఫాలోయింగ్‌ను చివరి వరకూ కాపాడుకున్నాడు. ఫలితంగా అందరూ అనుకున్నట్లుగానే నాలుగో సీజన్‌లో విజేతగా నిలిచి సత్తా చాటాడీ యంగ్ హీరో.

ఫుల్ బిజీగా అభిజీత్.. సినిమా కూడా
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత అభిజీత్ ఫుల్ బిజీ అయ్యాడు. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. అదే సమయంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడీ బిగ్ బాస్ విజేత. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అభిజీత్ క్రేజ్‌కు నిదర్శనంగా కొత్త ట్రెండ్
అభిజీత్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ సారి అతడి పేరు మీదున్న హ్యాష్ ట్యాగ్‌తో మిలియన్ ట్వీట్లకు పైగా చేసి నేషనల్ రికార్డును కూడా సెట్ చేసుకున్నారు. ఇక, తాజాగా అతడి పేరు మరోసారి దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. దీంతో అభిజీత్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టేస్తూ
ప్రస్తుతం ట్విట్టర్ #100MostHandsomeFaces2020 అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనికి చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ తమకు నచ్చిన వ్యక్తిని నామినేట్ చేస్తున్నారు. అయితే, ఇందులో ఎక్కువ శాతం అభిజీత్ పేరే కనిపిస్తోంది. బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టేస్తూ అతడి ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇక, ఈ జాబితాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు కూడా కనిపిస్తోంది.