Bigg Boss Telugu 9: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా భరణి.. బిగ్ బాస్‌కే షాక్ ఇచ్చిన సీరియల్ నటుడు

సీరియల్ నటుడు భరణి శంకర్ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కింకున్నారు. తెలుగు టెలివిజన్ రంగంలో 20 ఏళ్లకు పైగా టెలివిజన్ రంగంలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ వచ్చారు. తనకు అందిన అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చారు. తన రూపాన్ని బట్టే ప్రేక్షకులను విలన్ గా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. సీరియల్స్ తో పాటు సినీ పరిశ్రమలోనూ ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.

2003 నుంచి భరణి శంకర్ బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. టీవీ రంగంలో బ్లాక్ బాస్టర్ సీరియల్స్‌తో పాటు వెండితెరపై బ్లాక్ బాస్టర్ సినిమాల్లో కీలక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు ఇటు టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ లోనూ నటిస్తున్నారు. తెలుగు టెలివిజన్ రంగంలో ప్రసారమైన కామెడీ, రొమాంటిక్ సిరీయల్స్ లో యాంటీ హీరో పాత్రలు పోషించారు. విలన్ గా ఒకప్పుడు బుల్లితెర సంచలనం సృష్టించారు.

Actor Bharani Grand Entry to Bigg Boss Telugu Season 9

ఆయన కెరీర్ లో 30పైకి సీరియల్స్ లో నటించి మెప్పించారు. సీరియల్ రంగంలో అగ్ర నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన నటించిన సీరియల్స్ సీతామహాలక్ష్మి, తరంగాలు, కుంకుమ రేఖ, పున్నాగ వంటి సిరీయల్స్ తో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈయన ఇప్పుడు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. భరణిని ఎంపిక చేసిన సమయంలో ఆయన ఒక బాక్స్ తో ఎంట్రీ ఇచ్చారు.

అయితే బిగ్ బాస్ భరణిని ఆ బాక్స్ ఏముందని ప్రశ్నించారు. అందులో తనకు ఎంతో ఇష్టమైనది ఉన్నదని, తన శరీరంలో అది ఒక భాగంగానే భావిస్తున్నానని చెప్పారు. అందుకు ఆ బాక్స్ ను తన వెంటనే తీసుకుని వెళ్తానని అంటాడు. అలా కుదరదని బిగ్ బాస్ చెబుతాడు. అందులో ఏముందో ముందే చూపించి, ధరించి వెళ్లాలని బిగ్ బాస్ కండీషన్ పెడుతాడు.అందుకు భరణి ఒప్పుకోడు. అది నేను స్టేజ్ మీద చూపించలేనని అంటాడు. అలాగైతే హౌజ్ లోకి వెళ్లలేవని బిగ్ బాస్ నిర్ణయిస్తాడు. దీంతో తిరిగి వెళ్లిపోతాడు.

ఇక ఇద్దరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన తర్వాత భరణి మళ్లీ రీఎంట్రీ ఇస్తాడు. అందులో ఏమీ లేదని, ఓన్లీ చైన్ విత్ లాకెట్ అని బిగ్ బాస్ వెల్లడిస్తారు. లేడీ కంటెస్టెంట్స్ ను ఎలాగూ వారి జ్యూవెల్లరీతో అనుమతిస్తున్నాం కాబట్టి భరణి గారిని చైన్ తో లోపలికి పంపించేందుకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఇక భరణి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తన జీవితంలో 3 ఏళ్ల కింద ఒక పర్సన్ కలిశారని, ఆయన వాళ్లే బాడీ ఫిట్ గా చేసుకుని మైండ్ సెట్ కూడా స్ట్రాంగ్ గా చేసుకున్నాని చెప్పారు. అంతకు ముందుకు చాలా గందరగోళంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ పరిచయం చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X