Bigg Boss Agnipariksha : కంటెస్టెంట్స్ ను వేధించి.. హింసించేది అందుకే.. నవదీప్
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణ దక్కిందో తెలిసిందే. అంతకంటే ముందే వివిధ భాషల్లో ప్రారంభమైన ఈ రియాలిటీకు అత్యధిక రేటింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం విశేషం. ఇదే సమయంలో తెలుగులోనూ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు బ్రహ్మండమైన ఆదరణ దక్కింది. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. వందలాది మందికి గుర్తింపును అందించిందీ షో. ఇక ప్రస్తుతం వైబ్ మొత్తం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9పై ఉంది. ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సందర్భంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తున్నారు. Bigg Boss Agniparikshaకు హీరోలు నవదీప్, అభిజీత్, నటి బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిలకు పలు రకాల టాస్కులు ఇచ్చి వారిలోని విభిన్న కోణాలను వెతుకుతున్నారు. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉంటారో వారిని నెక్ట్స్ లెవల్ కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పోటీదారులు భయంకరమైన టాస్క్ ల్లో పాల్గొంటున్నారు.

అయితే కంటెస్టెంట్స్ కు టాస్క్ ల పేర్లతో టార్చర్ చూపిస్తున్నారంటూ బయట జనాలు అభిప్రాయపడుతున్నారు. పోటీదారులను ఎలాంటి లక్ష్యం లేకుండానే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ, ఇష్టారీతినా వాళ్లపై మాట్లాడుతున్నారంటూ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నిర్వించే టాస్క్ లు అర్థం లేనివని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నవదీప్ తాజాగా బిగ్ బాస్ తెలుగు అగ్నిపరీక్షపై వస్తున్న ట్రోల్స్, విమర్శలపై స్పందించారు. ఎందుకు కంటెస్టెంట్స్ తో భయంకరమైన టాస్క్ లు చేయిస్తున్నారో క్లారిటీ ఇచ్చారు.
నవదీప్ మాట్లాడుతూ.. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎలాంటి అవగాహన లేకుండా వెళితే అక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ పెద్ద సెలబ్రెటీలు పెద్ద నోరేసుకొని ఆ కామన్ మ్యాన్ ల మీద ఎక్కెస్తారు. దాంతో వాళ్లకి ఓటింగ్ లో కూడా ఫెయిర్ ఛాన్స్ ఉండదని ముందే వాళ్లని ముందుగా అగ్నిపరీక్షకు ఆహ్వానించాం. అగ్ని పరీక్షలో ముందుగానే వారిని వేధించి, హింసించాల్సి వస్తోంది. అది కూడా బిగ్ బాస్ హౌస్ లో వాతావారణం ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో వారిని నిలబెడుతున్నాం.
ఎందుకంటే వాళ్లు కామన్ మ్యాన్ గా బిగ్ హౌజ్ లోకి వెళ్లాలని అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి పరీక్షలు పెట్టాల్సి వస్తోంది. అలాగే ప్రేక్షకులకు కూడా వాళ్లను పరిచయం చేసి, వాళ్ల వ్యక్తిత్వాన్ని మీకూ తెలియజేస్తే వాళ్లకి ఎక్కువ ఓటు వేసే అవకాశం దక్కుతుంది. అది మాత్రమే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఉద్దేశం. మరేది కాదని నవదీప్ వివరణ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ అగ్నిపరీక్షకు కామన్ మెన్ పోటీదారుల నుంచి 14000 దరఖాస్తులు అందాయి. అందులో నుంచి 100 మందిని ఫిల్టర్ చేసి.. వారిలో నుంచి మరో 18 మంది ఇప్పటి వరకు ఫిల్టర్ చేశారు. మున్ముందు వీరిలో నుంచి 5 గురుని ఫైనల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











