For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బిగ్‌బాస్11 విజేత శిల్పా షిండే.. హీనా ఖాన్‌, వికాస్‌కు షాక్.. సల్మాన్, అక్షయ్ హంగామా!

  By Rajababu
  |
  బిగ్‌బాస్11 విజేత శిల్పా షిండే.. సల్మాన్, అక్షయ్ హంగామా!

  బాబీజీ ఘర్ పర్ హై ఫేమ్ శిల్పా షిండే బిగ్‌బాస్ 11 విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఈ రియాలిటీ షోలో హౌస్‌మేట్ హీనా ఖాన్‌పై తక్కువ తేడాతో గెలుపొందింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అత్యంత ఆహ్లాదకరంగా, వినోదాతక్మకంగా సాగింది. బిగ్‌బాస్ 11 ఫైనల్ వివరాలు మీకోసం..

  ట్రోఫితోపాటు 44 లక్షలు

  ట్రోఫితోపాటు 44 లక్షలు

  బిగ్‌బాస్‌ 11 విజేతగా నిలిచిన శిల్ఫా షిండే‌కు రూ.44 లక్షల నగదు పరిహారం, ట్రోఫి బహుమతిగా లభించింది. ఈ గేమ్‌ షోలో హీనాఖాన్ ఫస్ట్ రన్నరప్‌గా, సెకండ్ రన్నరప్‌గా వికాస్ గుప్తా నిలిచారు. లైవ్ ఓటింగ్‌లో ప్రేక్షకులు శిల్పాకే మద్దతు పలికారు.

  శిల్పా షిండే తొలివారం నుంచే

  శిల్పా షిండే తొలివారం నుంచే

  బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన తొలి రోజు నుంచే శిల్పా షిండే ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. వికాస్ గుప్తాతో విభేదాలు, గొడవలను ఆమె చాలా సమర్ధవంతగా ఎదుర్కొన్నది. ఓ దశలో వారి మధ్య గొడవలు ఆమెకు నరకంగా మారాయి.

  ముఖ్య అతిథిగా అక్షయ్ కుమార్

  ముఖ్య అతిథిగా అక్షయ్ కుమార్

  బిగ్‌బాస్ గేమ్ షోకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వచ్చారు. ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ హంగామా చేశారు. జనవరి 25వ తేదీన విడుదల కానున్న తన చిత్రం ప్యాడ్‌మాన్ ప్రమోషన్ కార్యక్రమాన్ని బిగ్‌బాస్ వేదికపై చేపట్టారు.

   ధించక్ పూజతో అక్షయ్, సల్మాన్

  ధించక్ పూజతో అక్షయ్, సల్మాన్

  ధించక్ పూజ‌, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఒకే స్కూటీపై బిగ్‌బాస్ వేదికపై హంగామా చేశారు. స్కూటీపై ప్రయాణిస్తూనే ధించక్ పూజ ధిలోంకా షూటర్ పాటపాడి హంగామా చేసింది.

  స్వప్న చౌదరీతో అక్షయ్ డ్యాన్సులు

  స్వప్న చౌదరీతో అక్షయ్ డ్యాన్సులు

  హర్యానా గాయని స్వప్న చౌదరీతో కలిసి అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వేదికపై డ్యాన్స్ చేశారు. ముఝే షాదీ కరోగి పాటపై సల్మాన్, అక్షయ్‌తో కలిసి స్వప్న స్టెప్పులు వేసింది.

  English summary
  Shilpa Shinde was announced as the winner of Bigg Boss 11 by host Salman Khan and Akshay Kumar, who was on the grand finale to promote his upcoming film. It came down to Shilpa, Hina Khan, Vikas Gupta and Puneesh Sharma. Shilpa received the maximum number of votes and outdid her three competitors to win the trophy and the prize money of Rs 44 lakh.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more