Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్‌గా సుమన్ శెట్టి.. ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన నటుడు
తెలుగు ప్రేక్షకుల్లో నటుడిగా, కమెడియన్ గా సుమన్ శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన చిత్రాల్లో జయం, ధనలక్ష్మి ఐ లవ్ యూ, కబడ్డీ కబ్బడీ, విజయం, నిజం, 7జీ బృందావనం కాలనీ వంటి చిత్రాలు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఆయన పాత్రలు, డైలాగ్ లు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండేలా చేశారు. మీమ్స్ లోనూ సుమన్ శెట్టి కామిక్ సీన్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఇక ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా 25 ఏళ్లుగా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇప్పటి వరకు సుమన్ శెట్టి వెండితెరపైనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇక తాజాగా పాపులర్ రియాలిటీ గేమ్ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కు ఆయన సెలబ్రెటీ కంటెస్టెంట్ గా ఎంపికయ్యారు. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లోనూ మరింత గుర్తింపును దక్కించుకునే ప్రయత్నం చేయబోతున్నారు. మొత్తానికి ఆయనను అక్కినేని నాగార్జున కంటెస్టెంట్ గా అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా సుమన్ శెట్టికి సంబంధించిన ఒక స్పెషల్ ఏవీని ప్రదర్శించారు. అందులో సుమన్ శెట్టి తన జీవితం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుతూ వచ్చాడు.

సుమన్ శెట్టి మాట్లాడుతూ తనకు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది డైరెక్టర్ తేజా అని చెప్పారు. ఆయన నాకు ఇచ్చిన అవకాశం వల్లనే ఈరోజు చిత్ర పరిశ్రమలో ఉన్నానన్నారు. నిజం చిత్రం మొదలు ఇప్పటి వరకు 300లకు పైగా సినిమాలు చేశానని చెప్పారు. ఇక తన కుటుంబం అంటే చాలా ఇష్టమని చెప్పారు. చిన్నప్పటి నుంచి నటన నటన అనే తిరగేవాడినన్నారు. కొన్నాళ్లకు మంచి అవకాశాలు వచ్చాక ఇంట్లో పెళ్లి చేసుకోమని చెప్పారు. చివరికి నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మా నాన్న 3 ఏళ్ల కింద జరిగిపోయారు... అని చెప్పుకొచ్చారు.
ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జునతో మాట్లాడుతూ మొదటి సారిగా నాగార్జునను పూర్ణ మార్కెట్ దగ్గర చూశానని చెప్పారు. శివమణి షూటింగ్ సమయంలో చూశానని, అప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దామని ఎంతోగానో ప్రయత్నించి విఫలం అయ్యానని చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ వేదికపై షేక్ హ్యాండ్ తీసుకున్నారు. ఇక నాగార్జున షేక్ హ్యాండ్ తో పాటు హగ్ కూడా ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఆ తర్వాత నాగార్జున సుమన్ శెట్టి ఎందుకు తెలుగు చిత్ర పరిశ్రమలో రెగ్యులర్ గా కనిపించడం లేదని ప్రశ్నించాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను చేతి నిండా సినిమాలతో ఉన్నాను. కాకపోతే తమిళం, మలయాళం, కన్నడ, బోజ్ పూరిలో ఎక్కువగా సినిమాలు చేస్తున్నానని, అందుకే ఇక్కడ కనిపించడం లేదని సుమన్ శెట్టి క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











