»   » అలా అనటానికి సిగ్గు లేదూ...కాళ్లు విరగ్గొడతా... టీవి షో లో నటి గీత, క్షమాపణకు డిమాండ్

అలా అనటానికి సిగ్గు లేదూ...కాళ్లు విరగ్గొడతా... టీవి షో లో నటి గీత, క్షమాపణకు డిమాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: . 'ఒక యువతి నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా ఓ అమ్మాయివన్న విషయాన్ని మర్చిపోయావా' అనేది ఏ బి గ్రేడ్ సినిమాల్లో కనిపించే డైలాగు అనుకోకండి. మనం నిత్యం చూసే టీవీ ఛానెల్స్ లో కనపించే వాస్తవం ఇది.

టీఆర్పీల కోసం టీవీ ఛానెల్స్ రోజు రోజుకూ కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కావాలని వివాదాలను రాజేస్తున్నాయి. ముఖ్యంగా టీవీ షోలు చూస్తూంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది సామాన్యులకు. ఆ షోలలో వచ్చే వివాదాలు, వాదాలు నిజమేనా లేక కావాలని క్రియేట్ చేస్తున్నారో అర్దం కాని పరిస్దితి ఏర్పడుతోంది.

ముఖ్యంగా ఫ్యామిలీలలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపెడతామంటూ మొదలైన టీవీ షోలు గురించి అయితే చెప్పక్కర్లేదు. అవి చూస్తూంటే అసలు మన చుట్టు ప్రక్కల ఏం జరుగుతోందో అనే సందేహం, సమాజంలో ఇలాంటి మనుష్యులతో నిండిపోతోందా అనే భయం ఏర్పడుతుంది. చిన్న సమస్యను గ్లోరిఫై చేసి చూపెడుతూ...పదే పదే వివాదానికి దారితీసే విధంగా ఈ షోలను డిజైన్ చేస్తున్నారు.

Photo Courtesy : Zee Telugu & Gemini TV

సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు టీఆర్పీ ల కోసమో లేక నిజంగా వచ్చిన ఎమోషన్ తో మాట్లాడిందో కానీ మాజీ సినీ నటి బ్రతుకు జట్కాబండి పోగ్రామ్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా సంచలనం గా మారాయి. దానిపై రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి.

ఓవర్ అయ్యారు

ఓవర్ అయ్యారు

ఇప్పుడు తాజాగా ఓ చానల్‌లో ప్రసారమయ్యే ఇలాంటి ఓ షోలో నటి గీత వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ లెస్బియన్ జంట టీవీ షోకొచ్చింది. ఆసక్తిరేపే విధంగా పోగ్రామ్ డిజైన్ చేసారు కానీ కాస్త ఓవర్ అయ్యారనే అంటున్నారు.

తరచి తరచి ఆన్సర్ రప్పించాలని

తరచి తరచి ఆన్సర్ రప్పించాలని

ఆ పోగ్రామ్ కు వచ్చిన ఆమె...తను సిందు అనే అమ్మాయితో ఉంటున్నాను అని చెప్పింది. ఆమెతో ఏ విధమైన రిలేషన్. మంచిగా చూసుకుంటుంది అంటే..మంచి బట్టలు కొనిస్తారనా, చదువుకోవటానికి ప్రోత్సహిస్తారనా.. లేకపోతే ఎందుకు సింధు అంటే అంత అభిమానం అని తరిచి తరిచి అడిగారు.ఆమె నోటి నుంచి ఏదో చెప్పించాలనే విషయం అక్కడ కనపడుతోంది.

అన్ని రకాలుగా ఇష్టపడ్డాను అంటే..

అన్ని రకాలుగా ఇష్టపడ్డాను అంటే..

అన్నిరకాలుగా ఇష్టపడ్డాను అంటే...... ఇన్నాళ్లూ నా తల్లితండ్రులు ఇవ్వలేదు కాబట్టి..ఇప్పుడు సింధు ఇస్తోంది కాబట్టి ఆమెను ఇష్టపడుతున్నావా అని పోగ్రామ్ యాంకర్స్ అడిగారు. దానికి ఆమె కాదు..ఆమెను ఇష్టపడ్డాను. ఆమెను ఇష్టపడినంతగా ఇంక ఎవరినీ ఇష్టపడలేదు అని ఆమె చెప్పింది. ఆ విధంగా నిన్ను ఎవరూ చూసుకోరా జీవితంలో నిన్ను అని యాంకర్ మరింత స్పష్టత కోసం అన్నట్లుగా అడిగారు.

ఏ రకంగా శారీరకంగా..

ఏ రకంగా శారీరకంగా..

ఎలా చెప్పగలవు...ఇంత చిన్న వయస్సులో ఎవరూ చూసుకోలేరు అని...అయినా .ఒకే ఇష్యూ అడుగుతాను సింధు ఎందుకుకావాలి అని యాంకర్ రెట్టించారు. దానికి ఆమె దాంతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అని షోకు వచ్చినామె చెప్పింది. ఏ విధంగా హ్యాపీగా ఉంటావు.. అంటే అన్ని రకాలుగా అంటే ..మళ్లీ ఏ రకం అని రెట్టించి అడిగారు. ఒక రకంగా అంటే మానసింకగానా, శారీరకంగానా అని అడిగారు. అంతేకాకుండా..సింధు ప్లేస్ లో ఎవరిని పెట్టినా కుక్కలని పెట్టినా, పువ్వులని పెట్టినా హ్యాపీగా ఉంటావా అని అడిగారు.

అమ్మాయి..అమ్మాయి కలిసి ఉండచ్చా

అమ్మాయి..అమ్మాయి కలిసి ఉండచ్చా

సమాజంలో ఉండే వ్యతిరేకతను నిలదొక్కుకుని జీవించగలరా అని అడిగారు. సమాజం నాకు అవసరం లేదు అని ఆమె చెప్పింది. ఎలా అవసరం లేదమ్మా..మనం అడవిలో లేము కదా అని అని షో నిర్వాహకలు ప్రశ్నించారు. అంతేకాకుండా మీ అక్క ఎవరిని చేసుకుంది..అబ్బాయిని కదా. మరి సిందు ఎవరో చెప్పు ఫస్ట్.. అమ్మాయి కదా.. అమ్మాయి..అమ్మాయి ఇద్దరు కలిసి ఉండచ్చా అని డైరక్ట్ గా ఆమెను అడిగారు. ఆమె ఉంటాము అని సమాధానమిచ్చింది.

శారీరకంగా మగవాడి తో పనిలేదు

శారీరకంగా మగవాడి తో పనిలేదు

నాకు శారీరకంగా ఎవరి అవసరమూ లేదు , ఆమెతో ఉంటాను ఆమె స్పష్టంగా చెప్పింది. దానికి షోకు వచ్చిన మరొకరు..నీకు ఇప్పుడు ఉండకపోవచ్చు..తర్వాత కూడా ఉండవని ఎలా చెప్పగలవు అని అడిగారు.

ఇవేనా ఆడపిల్లకు కావాల్సింది

ఇవేనా ఆడపిల్లకు కావాల్సింది

రేపు మీకు పిల్లలు కావాలి అని అనిపిస్తే..అని అడిగారు. దానికి ఆమె మేం మొదట అనుకున్నాం..మాకు పిల్లలు వద్దు అని ఆమె చెప్పారు. ఒక ఆడపిల్లకు రెండే కోరికలు ఉంటాయి. ఒకటి ఒక మంచి భర్త దొరకాలి, ఇంకొకటి తనకు కావాల్సిన పిల్లలకు ఒక మంచి తండ్రి కావాలని అంటూ యంకర్ చెప్పి ఆమెను ఈ విషయమై ప్రశ్నించారు.

ఎలా పెళ్లి చేసుకుంటారు..

ఎలా పెళ్లి చేసుకుంటారు..

మీ పెళ్లి లీగల్ పరంగా, కలిసి ఉండటం కష్టం కదా అంటే పెళ్లి చేసుకుంటాను అమె చెప్పింది. ఎట్లా పెళ్లి చేసుకుంటావు అంటే... సింధు..నా మెళ్లో తాళి కడుతుంది అని చెప్పింది.

అమ్మాయి ప్రపోజ్ చేస్తే...

అమ్మాయి ప్రపోజ్ చేస్తే...

ట్రాన్స్ మ్యాన్‌ను గీత అడిగిన ప్రశ్నకు అవాక్కవడం ఆ షో చూసే వాళ్ల వంతైంది. ‘ఒక యువతి నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా ఓ అమ్మాయివన్న విషయాన్ని మర్చిపోయావా' అని గీత ఆ ట్రాన్స్ మ్యాన్ అడిగింది.

మీ ఇద్దరినీ ఏదైనా చేసి ఉంటే..

మీ ఇద్దరినీ ఏదైనా చేసి ఉంటే..

‘ఒక అబ్బాయిలా ఆ అమ్మాయిని ఇంటి నుంచి తీసుకొచ్చావు... ఎవరైనా నిన్ను ఎటాక్ చేసి మీ ఇద్దరినీ ఏదైనా చేసుంటే పరిస్థితి ఏంటి?' అని ప్రశ్నల వర్షం కురిపించి షాక్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఏం చెప్పాలో అర్దం కానీ డైలమోలో పడిపోయింది.

నాకు తెలుసు ఈ లెస్బియన్స్

నాకు తెలుసు ఈ లెస్బియన్స్

లెస్బియన్స్, గే పెళ్లి చేసుకుంటున్న విషయం తనకు తెలుసని కానీ పాశ్చాత్య దేశాల జాడ్యాన్ని ఇండియాలో పాటించడం ఎంత వరకూ సబబని గీత అడిగింది. ఇలా అడిగేసరికి ఆమెకు నోట మాట రాలేదు. ఇలాంటి ప్రశ్నల వర్షం కురిపించారు.

మీరిలా సినిమాలకు, పార్క్ లకు

మీరిలా సినిమాలకు, పార్క్ లకు

‘మీ ఇద్దరు తీసుకున్న నిర్ణయం అవివేకం, మీరిలా పార్కులకు, సినిమాలకు వెళితే ఉరి తీస్తారు' అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అబ్బాయిలా మారాలంటే డ్రస్ చేసుకున్నంత మాత్రాన సరిపోదని గీత చెప్పింది.

కాళ్లు విరగకొడుతా...ఏం

కాళ్లు విరగకొడుతా...ఏం

అయితే ఓ సందర్భంలో కోపాన్ని అణచుకోలేక, ఆగ్రహంతో ఊగిపోయిన గీత ‘ఒక అమ్మాయివి అయ్యి ఉండి వేరే అమ్మాయితో గడపడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించింది. నిన్ను కొట్టి, కాళ్లు విరగ్గొడతానంటూ' వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

లెస్పియన్స్ గ్రూప్ సీన్ లోకి

లెస్పియన్స్ గ్రూప్ సీన్ లోకి

దీంతో ఈ షోపైనా, గీత పైన హైద్రాబాద్ లెస్బియన్స్ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఈ విషయం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

సగటు ప్రేక్షకుడుకి షాక్ ఇచ్చేలా

సగటు ప్రేక్షకుడుకి షాక్ ఇచ్చేలా

కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు వేదికలుగా చెప్పుకునే ఈ షోలు సగటు ప్రేక్షకుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. . నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను ఇలా నడి బజార్లో పెట్టడమేంటని పలువురు విమర్శిస్తున్నప్పటికీ, ఈ షోలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

ఛానెల్ ప్రారంభ రోజుల్లో

ఛానెల్ ప్రారంభ రోజుల్లో

ఛానెల్స్ వచ్చిన ప్రారంభ రోజుల్లో డ్యాన్స్ షోలు, కామెడీ షోల్లో కనిపించిన ఈ జాడ్యం ఇప్పుడు రియాల్టీ షోల పేరుతో మొదలవటం ఆందోళన కర విషయమే.కానీ చూసే జనానికి మాత్రం ఎక్కడ లేని ఆసక్తిని రేకెత్తిస్తూండటంతో టీఆర్పీలు బాగున్నాయి.

నడివీధిలో పెడుతున్నారు

నడివీధిలో పెడుతున్నారు

కుటుంబ సమస్యలను పరిష్కరిస్తామంటూ వస్తున్న ఈ షోలు ... జీవితాలను నడి వీధిలో పెడుతున్నాయనటంలో సందేహం లేదు. ఈ షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించే వారి తీరు మరీ దారుణంగా మారిపోతోంది. షో పాపులారిటీ కోసం చూపెడుతున్నవి సిగ్గుచేటని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సీనియర్స్ తో ..

సీనియర్స్ తో ..

సినిమాల్లో నటించి టీవిల్లోకి వచ్చిన జీవిత, రోజా, సుమలత, గీత ఈ పోగ్రామ్ లకు వ్యాఖ్యాతలుగా వ్యవహిస్తున్నారు. సంఘంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఈ నలుగురు చేస్తున్న షోలకు తెలుగు జనం నీరాజనం పడుతున్నారనే చెప్పాలి.

జీవితపై కేసు

జీవితపై కేసు

మొన్నామధ్య ఓ టీవీ షోలో రోజా ఓ వ్యక్తిని కొడతానంటూ చెయ్యెత్తారు. షోకు రాకపోతే కేసు పెడతామంటూ బెదిరించినట్లు జీవితపై ఆరోపణలొచ్చాయి. ఇలా ఈ షోలపై రోజుకో సమస్య వచ్చి పడుతోంది. వీటిని ఎలా నియంత్రిస్తారో చూడాలి.

English summary
Popular actress Geetha is in trouble as she made a humiliating treatment on an LGBTQ couple during a television show in Telugu. Her act is strongly condemned by activists.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu