twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్2: కౌశల్‌కు మాధవి లత సపోర్ట్... నానిపై విమర్శలు, ఎన్టీఆర్ గుర్తొచ్చాడంటూ!

    By Bojja Kumar
    |

    గతవారం బిగ్‌బాస్ ఇంటి నుండి తేజస్వి ఎలిమినేట్ అయిన తర్వాత సోమవారం మళ్లీ ఫ్రెష్‌గా వచ్చేవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సారి ఇంటి సభ్యులంతా కౌశల్‌ను టార్గెట్ చేస్తూ గుడ్లు పగలగొట్టారు. పలు విషయాల్లో కౌశల్ తీరును తప్పుబడుతూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాధవి లత రంగంలోకి దిగి కౌశల్‌కు మద్దతుగా పోస్టు చేయడం చర్చనీయాంశం అయింది.

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Day 45 Highlights
    నా ఫీలింగ్స్ నేనెందుకు కంట్రోల్ చేసుకోవాలి

    నా ఫీలింగ్స్ నేనెందుకు కంట్రోల్ చేసుకోవాలి

    ఒకటి చెప్పాలి అనిపించి కంట్రోల్ చేసుకున్నాను. కానీ నా ఫీలింగ్స్ నేను ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? నేను బిగ్‌బాస్ షోలో కౌశల్‌కు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అతడు 100% శాతం గేమ్ ఆడుతున్నాడు.... అంటూ తన అభిప్రాయాలు చెప్పడం మొదలు పెట్టింది మాధవి లత.

    బిగ్‌బాస్ అనేది గేమ్, బంధాలు పెంచుకోవడం ఏమిటి?

    బిగ్‌బాస్ అనేది గేమ్, బంధాలు పెంచుకోవడం ఏమిటి?

    బిగ్‌బాస్ అంటేనే గేమ్ షో. అక్కడ హౌస్ మేట్స్ తో బంధాలు పెంచుకోవడం కాన్సెప్టు కాదు. ప్రేక్షకుల మనసు గెలవాలి, గేమ్ ఆడాలి. అదే బిగ్‌బాస్ థీమ్. అతడు దాన్ని పర్ఫెక్టుగా ఫాలో అవుతున్నాడు.

    సెల్ఫిష్‌నెస్ ఉంటేనే గేమ్ ఆడగలం

    సెల్ఫిష్‌నెస్ ఉంటేనే గేమ్ ఆడగలం

    అతడు మాట్లాడకపోతే ఇంట్రోవర్ట్ అంటారు, మాట్లాడితే సెల్ఫిష్ అంటారు. గెలవాలంటే గేమ్ ఆడాలి కానీ అనుబంధాలు, మకరందాల సీరియల్ నడపకూడదు కదా. గేమ్ అన్నాక సెల్ఫిష్ నెస్ తప్పకుండా ఉండాలి. ఒక వేళ అదిలేక పోతే ఎవరూ గేమ్ ఆడలేరు.

    కౌశల్ మాత్రమే ఎందుకు అపరాధి అయ్యాడు?

    కౌశల్ మాత్రమే ఎందుకు అపరాధి అయ్యాడు?

    ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరికి వారు సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నారు. మరి కేవలం కౌశల్ మాత్రమే ఎందుకు అపరాధి అయ్యాడు. ఎందుకంటే అతడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నాను. నా ఉద్దేశ్యం ప్రకారం నేను సిన్సియార్టికే సపోర్టు చేస్తాను.

    తేజస్వి ఫాల్తూ కామెంట్స్

    తేజస్వి ఫాల్తూ కామెంట్స్

    కౌశల్ గేమ్ గెలవొచ్చు కానీ... నేను ఇంట్లో వాళ్లను గెలిచాను అని తేజస్వి చెప్పిన డైలాగ్ చాలా సిల్లీగా ఉంది. ఫాల్తూ‌గా ఉంది.... అంటూ మాధవి లత విరుచుకుపడింది

    ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఫ్రెండ్స్ అంతకన్నా కాదు

    ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఫ్రెండ్స్ అంతకన్నా కాదు

    బిగ్‌బాస్ అనేది గేమ్.. ఆడియన్స్‌ను గెవలవాలి... గేమ్ గెలవాలి... హౌస్ మేట్స్‌ను గెలవడం కాదు. ఎందుకంటే వారు ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఫ్రెండ్స్ అంతకన్నా కాదు. ఎవడి గేమ్ వారు ఆడండి అని నాని ప్రతివారం చెబుతూనే ఉన్నాడు.

     నాని తీరు నచ్చలేదు, ఎన్టీఆర్ గుర్తొచ్చాడు

    నాని తీరు నచ్చలేదు, ఎన్టీఆర్ గుర్తొచ్చాడు

    కానీ గడిచిన వారం ఎందుకో నాని తీరు నచ్చలేదు. ఇన్నాళ్లు నాని హోస్ట్ పర్ఫెక్ట్, ఈ సారి మాత్రం ఎన్టీఆర్ గుర్తొచ్చాడు.

    ఈ వీక్ నాని చాలా వీక్ అనిపించాడు

    ఈ వీక్ నాని చాలా వీక్ అనిపించాడు

    కానీ ఇది బిగ్‌బాస్ టీమ్ బ్యాగ్రౌండ్ గేమ్. కౌశల్ ఫాలోయింగ్ వాళ్లకు కూడా జలస్ క్రియేట్ చేసిందని అర్థమైంది. నాని బాగా చేస్తున్నాడు. కానీ ఎందుకో ఈ వీక్ తనే వీక్ అయ్యాడు. ఇది నాకు పర్సనల్‌గా నచ్చలేదు... అని మాధవి లత తెలిపారు.

    English summary
    Actress Madhavi Latha supports BB2 Kaushal. Bigg Boss Telugu 2 is the second season of the Telugu-language version of the reality TV show Bigg Boss broadcast in India. The season premiered on June 10, 2018 on Star Maa. Nani hosts the show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X