నీతో సినిమా తీస్తే టీ డబ్బులు రావు.. తలతీస్తేనా.. సుధీర్ పై నిహారిక కామెంట్స్
యాక్టర్, కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ బుల్లితెరపై దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. తన మల్టీటాలెంటెడ్ తో ప్రేక్షకులను పలు విధాలుగా అలరిస్తూనే వస్తున్నారు. కొన్నాళ్ల పాటు జబర్దస్త్ కామెడీ షోతో నవ్వులు పూయించారు. తనదైన శైలిలో కామెడీ స్కిట్లు చేసి అలరించారు. తనకంటూ స్మాల్ స్క్రీన్ పై సరైన గుర్తింపు వచ్చిన తర్వాత సినిమాల్లోనూ కీలక పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలతో హీరోగానూ నటించి మెప్పించారు. బిగ్ స్క్రీన్ పై మాస్ అవతార్ లో అలరించి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం మాత్రం టీవీ షోలతో ఆకట్టుకుంటున్నారు.
ఇప్పటికే సర్కార్ సీజన్ 5, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ వంటి టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సరిగమప లిటిల్స్ ఛాంప్స్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈషోకు ఎస్పీ శైలజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, కొణిదెల నిహారిక జడ్జీలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షో ప్రారంభం సందర్భంగా ఇంట్రో వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈక్రమంలో షోపై మరింత ఆసక్తిని పెంచేశారు. ఇదే సమయంలో నిహారిక కొణిదెల, అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్ మధ్య జరిగిన కన్వర్జేషన్ షాకింగ్ గా మారింది.

నిహారిక కొణిదెల షోకు హాజరైన సందర్భంగా సుడిగాలి సుధీర్ సినిమా ఆఫర్ అడిగారు. మీరు కమిటీ కుర్రాళ్లు అనే అద్భుతమైన సినిమాను తీశారు. నాతో కూడా ఏదైనా కమిటీ అనే సినిమాను తీయొచ్చు కదా అని సుడిగాలి సుధీర్ నిహారిక కొణిదెల అడిగాడు. దాంతో నిహారిక బదులిస్తూ నీతో కమిటీలు లాంటి సినిమాలు తీస్తే నాకు టీ డబ్బులు కూడా రావని చెబుతుంది. కనీసం ఏదైనా ఫ్యామిలీ డ్రామాను తీయొచ్చు కదా అని అడిగాడు. దాంతో మరింత షాకింగ్ ఆన్సర్ ఇస్తుంది. నీకు ఒక సీన్ చెబుతా అని చెబుతుంది. నువ్వు అలా నడుచుకుంటూ వస్తుంటే మొదట నీ కాళ్లు చూపిస్తాం, ఆ తర్వాత మోకాళ్లు, చెస్ట్, తల చూపించే లోపు తల తెగిపోద్ది అని అంటుంది. దాంతో షాక్ అవుతాడు.
నిహారిక సుడిగాలి సుధీర్ తో అన్న మాటలకు ఇక అనిల్ రావిపూడి, అనంత్ శ్రీరామ్ కూడా ఫన్నీ కామెంట్లు పేల్చారు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ అనంత శ్రీరామ్ దగ్గరకు వెళ్లి మీరు నా సినిమాలకు పాటలు రాయాలంటే ఎంత తీసుకుంటారని అడిగితే 3 కోట్లు అని చెబుతాడు. జనరల్ గా హీరోలకు రూ.3 లక్షలే కదా అని శ్రీరామ్ ను అడుగుతాడు. హీరోలకైతే 3కోట్లు, మీకైతే 3 కోట్లు అని చెబుతాడు. దీంతో సుధీర్ షాక్ అవుతాడు. మొత్తానికి సినిమా ఆఫర్ అడిగితే నన్ను ఆడేసుకుంటున్నారని అంటాడు. ఆ తర్వాత సింగర్ ఎస్పీ శైలజా సుధీర్ కు సపోర్ట్ చేస్తుంది. ఇదంతా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నమని చెబుతారు.
ఇలా సుడిగాలి సుధీర్ పై పేల్చిన ఫన్నీ కామెంట్లు, సరిగమప లిటిల్ ఛాంప్స్ షోకు సుడిగాలి సుధీర్ చేస్తున్న యాంకరింగ్ తీరు ఆకట్టుకుంటోంది. ఈ షో జీ తెలుగు ఛానెల్ లో ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుందని తెలిపారు. ఇక సుడిగాలి సుధీర్ చివరిగా గాలోడు అనే చిత్రంతో అలరించాడు. మాస్ ఆడియెన్స్ ను మెప్పించాడు. ఆ తర్వాత గోట్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











